ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Brain Tumor: ఈ మార్పులు కనిపిస్తే మెదడులో ట్యూమర్ ఉన్నట్టు అనుమానించాల్సిందే

ABN, Publish Date - Oct 16 , 2025 | 10:29 PM

శరీరంలో కనిపించే కొన్ని మార్పులు మెదడులో కణితి ఉందనేందుకు సంకేతాలు. అవేంటంటే..

1/8

తలనొప్పి వేధిస్తున్నా, ముఖ్యంగా ఉదయం వేళల్లో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటున్నా లేదా సమయం గడిచేకొద్దీ నొప్పి ఎక్కువవుతున్నా సందేహించి వెంటనే వైద్యులను సంప్రదించాలి

2/8

వ్యక్తుల పేర్లు, తేదీలు, కార్యక్రమాలను మర్చిపోవడం లేదా అతిగా కన్‌ఫ్యూజ్ అవడం కూడా మెదడులో ట్యూమర్ ఉందనేందుకు సంకేతం

3/8

మెదడులో ట్యూమర్ ఉన్న కొందరిలో కంటి సమస్యలు వస్తాయి. కళ్లముందు వస్తువులన్నీ రెండుగా కనబడటం, చూపు దెబ్బతినడం వంటి సమస్యలు ఉండే ఛాన్సుంది

4/8

బ్రెయిన్ ట్యూమర్ ఉన్న కొందరిలో వినికిడి దోషం కూడా కనిపిస్తుంటుంది.

5/8

కొందరిలో తలతిరగటం, నిలకడ లేకపోవడం, నడుస్తున్నప్పుడు తూలిపోయినట్టు ఉండటం వంటివి కనిపిస్తాయి.

6/8

ట్యూమర్ ఉన్న కొందరిలో ఫిట్స్ లేదా అకారణంగా మూర్ఛపోవడం, కన్ను అదరడం వంటి సమస్యలు ఉంటాయి.

7/8

బ్రెయిన్ ట్యూమర్ కారణంగా చికాకు, డిప్రెషన్, సామాజిక బంధాలు నిర్వహించడంలో సమస్యలూ కనిపిస్తాయి.

8/8

మెదడులో ట్యూమర్ ఉన్న వారిలో కడుపులో తిప్పినట్టు ఉండటం, వాంతులు ఉంటాయి.

Updated Date - Oct 16 , 2025 | 10:33 PM