Brain Health: ఈ పోషకాలు లోపిస్తే మెదడు సామర్థ్యం దెబ్బతినడం పక్కా
ABN, Publish Date - Sep 27 , 2025 | 11:20 PM
మెదడు ఆరోగ్యానికి కీలకమైన పోషకాలు ఏంటో అవి లోపిస్తే కలిగే సమస్యలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
విటమిన్ బీ1 (థయామిన్) లోపం వల్ల ఒంట్లో శక్తి ఉత్పత్తి తగ్గి మెదడు సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
తగినంత ఒమెగా-3 ఫ్యాటి ఆమ్లాలు లేకపోతే న్యూయ్రోన్‌లపై ఉండే మెంబ్రేన్ పొరలు దెబ్బతిని కణాల మధ్య సమాచార మార్పిడి దెబ్బతింటుంది.
ఇనుము లోపిస్తే మెదడు కణజాలానికి ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గి జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుంది.
జింక్ లోపం వల్ల న్యూరోట్రాన్స్మిటర్‌ల పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా కొత్త విషయాలు నేర్చుకునే శక్తి, భావోద్వేగాల నియంత్రణ, మానసిక దారుఢ్యం తగ్గుతుంది.
విటమిన్ బీ12 లోపిస్తే నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది. నాడీ కళాలపై ఉండే మయలిన్ పొరను దెబ్బతిని దీర్ఘకాలిక మేధో లోపాలను తెస్తుంది.
మెగ్నీషియం లోపం వల్ల సినాప్టిక్ ప్లాస్టిసిటీని దెబ్బతింటుంది. నాడీ కణాల మధ్య సమాచారం ప్రవాహాన్ని తగ్గి మెదడు న్యూరల్ నెట్‌వర్క్ బలహీనపడుతుంది.
కోలిన్ లోపం వల్ల అసెటైల్‌కోలిన్ ఉత్పత్తిని తగ్గుతుంది. ఇది కూడా జ్ఞాపకశక్తి సన్నగిల్లేలా చేస్తుంది.
కాబట్టి, వీటిల్లో ఏది లోపించినా మెదడు క్రమంగా బలహీనపడి మేధో శక్తి తగ్గిపోతుంది. మానసిక ఉత్సాహం, ఉల్లాసం తగ్గిపోతాయి.
Updated Date - Sep 27 , 2025 | 11:22 PM