Fighter Jets: ఈ దేశాల వాయుసేనల్లో ఫైటర్ జెట్స్ లేవని తెలుసా?
ABN, Publish Date - Oct 21 , 2025 | 11:55 PM
కొన్ని దేశాల వాయుసేనల్లో ఫైటర్ జెట్స్ లేవు. మరి ఈ దేశాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.
కొన్ని దేశాల వాయుసేనల్లో ఫైటర్ జెట్స్ ఉండవు. విపత్తు నిర్వహణ, ఇతర పౌర అవసరాల కోసమే పరిమిత స్థాయిలో సాధారణ విమానాలను నిర్వహిస్తాయి.
న్యూజిలాండ్ వాయుసేనలో ఫైటర్ జెట్స్ అన్నీ 2001లో రిటైర్ అయిపోయాయి. రక్షణ అవసరాల కోసం న్యూజిలాండ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, యూఎస్‌పై ఆధారపడుతోంది.
ఐస్‌ల్యాండ్‌కూ మిలటరీ లేదు. గగనతల నిఘా, ఇతర రక్షణ అవసరాల కోసం నాటో భాగస్వామ్య దేశాలపై ఆధారపడుతోంది
కోస్టారికా 1948లోనే సైన్యాన్ని రద్దు చేసింది. పౌర అవసరాల కోసం కొన్ని విమానాలను మాత్రమే నిర్వహిస్తోంది.
వనువాటూ కూడా విపత్తు నిర్వహణ, ఇతర అవసరాల కోసం చిన్న పారామిలిటరీ వాయుసేనను నిర్వహిస్తోంది. రక్షణ అవసరాల కోసం ఆస్ట్రేలియాపై ఆధారపడింది.
గ్రెనెడా, పనామా దేశాలు కూడా తమ పరిమిత వాయుసేను నిఘా, మానవతాసాయం కోసం వినియోగిస్తాయి. రక్షణ అవసరాల కోసం పలు ప్రాంతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
మారిషస్‌లో పోలీసుల సారథ్యంలో చిన్న వాయుసేన విభాగం ఉంది. సరిహద్దు భద్రత కోసం భారత్, ఫ్రాన్స్ సాయం తీసుకుంటోంది.
Updated Date - Oct 21 , 2025 | 11:57 PM