Monarchy: రాజు లేదా రాణి దేశాధిపతిగా ఉన్న దేశాలు ఇవే
ABN, Publish Date - Sep 26 , 2025 | 10:39 PM
నేటి ఆధునిక జమానాలో ఇప్పటికీ కొన్ని దేశాలు రాజులు, రాణులు దేశాధినేతలుగా ఉన్నారు. మరి ఆ దేశాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మలేషియాలో ప్రస్తుతం సుల్తాన్ ఇబ్రాహిం ఇస్కాండర్ రాజ్యాన్ని పాలిస్తున్నారు.
ఒమాన్‌లో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ 2020 జనవరిలో సింహాసనాన్ని అధిష్టించారు.
మోనాకోలో రెండవ ప్రిన్స్ ఆబర్ట్ 2005 నుండి దేశానికి అధినేతగా ఉన్నారు.
యూఏఈలో షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నాహ్యాన్ దేశానికి నేతృత్వం వహిస్తున్నారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లో మూడవ చార్లెస్ రాజుగా కొంత కాలం క్రితం సింహాసనాన్ని అధిష్టించారు.
కెనడాలో మూడవ చార్లెస్ నామమాత్రపు అధిపతిగా, గవర్నర్ జనరల్‌గా ఉన్నారు.
ఆస్ట్రేలియాలో కూడా మూడవ చార్లెస్ రాజుగా ఉన్నారు. స్థానికంగా ఆయనను గవర్నర్ జనరల్ అని పిలుస్తారు
Updated Date - Sep 26 , 2025 | 10:40 PM