Gut Health-Habits: జీర్ణవ్యవస్థకు చేటు చేసే ఈ అలవాట్లను వెంటనే వదిలించుకోవాలి
ABN, Publish Date - Sep 23 , 2025 | 10:48 PM
కొన్ని రోజువాలి అలవాట్ల కారణంగా మనకు తెలియకుండానే జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతోంది. మరి ఈ అలవాట్లేంటో కూలంకషంగా తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థ తనని తాను శుభ్ర పరచుకునే ప్రక్రియకు తరచూ చిరుతిళ్లు తినడం వల్ల ఆటంకాలు ఏర్పడతాయి.
ఖాళీ కడుపుతో మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం కడుపు లోపలి పొరపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
రోజంతా చూయింగ్ తినడం వల్ల కడుపులో నిరంతరం జీర్ణ రసాలు ఊరి కడుపుబ్బరం వంటి సమస్యలు రావొచ్చు
ఒత్తిడిలో ఉన్నప్పుడు తింటే ఆహారం పూర్తిగా జీర్ణం కాదు. శరీరం పోషకాలను పూర్తిగా గ్రహించలేదు
వైద్యుల సూచనలు లేకుండా ఆంటాసిడ్లను ఎక్కువగా వాడడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. సమతౌల్యం దెబ్బతింటుంది.
పని ఒత్తిడి ఇతరత్రా కారణాల వల్ల మలవిసర్జనను వాయిదా వేస్తే మలబద్ధకం బారిన పడు ప్రమాదం ఉంది.
ఒంటికి తగినంత ఎండ తగలక పోతే విటమిన్ డీ లోపం ఏర్పడుతుంది.
జీవనశైలి విషయంలో వీలైనంత శ్రద్ధ వహిస్తే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని సుదీర్ఘకాలం పాటు కాపాడుకోవచ్చు.
Updated Date - Sep 23 , 2025 | 10:48 PM