Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర
ABN, Publish Date - Nov 14 , 2025 | 04:15 PM
తెలంగాణలో మరోసారి ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర
ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం.. ఉపఎన్నికలోనూ జయకేతనం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలుపు
ప్రత్యర్థి.. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలు.. ప్రతి దశలోనూ లీడ్ లో నిలిచిన నవీన్ యాదవ్
10 రౌండ్లలో 24 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేసిన నవీన్ యాదవ్
కాంగ్రెస్ పార్టీకి 98,988. బీఆర్ఎస్ పార్టీకి 74,259. బీజేపీకి 17,061 ఓట్లు వచ్చాయి. అలాగే నోటాకు 924 ఓట్లు
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతు
ఒక్క షేక్ పేట్ డివిజన్‌లో మాత్రమే టఫ్ కాంపిటేషన్ కనిపించగా.. మిగిలిన అన్ని డివిజన్లలో ఏకపక్షంగా సాగిపోయింది.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించినట్లైంది. జూబ్లీహిల్స్ కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విజయోత్సవ ర్యాలీ తీశారు
Updated Date - Nov 14 , 2025 | 04:19 PM