E-Visa: ఈ-వీసాతో భారతీయులు ఈ 7 దేశాలను ఈజీగా చుట్టేసి రావొచ్చు
ABN, Publish Date - Sep 30 , 2025 | 04:58 PM
సాధారణ వీసాతో పోలిస్తే సులభంగా లభించే ఈ-వీసాతో భారతీయులు ఏడు దేశాలను చుట్టి రావచ్చు. మరి ఆ దేశాలు ఏంటో వాటి ఈ-వీసాల ధర ఎంతో తెలుసుకుందాం పదండి.
యూఏఈ ఇచ్చే ఈవీసాతో (రూ.6 నుంచి రూ.7 వేలు) దుబాయ్ ఆకాశహర్మ్యాలు, అబుదాబి సాంస్కృతిక వైభవాలు, ఎడారి అందాలను ఈజీగా చూడొచ్చు. గరిష్టంగా ఐదు రోజుల్లో జారీ అయ్యే ఈ-వీసా గడువు 30 - 60 రోజులు
దక్షిణ కొరియా భారతీయులకు రూ.5 వేల ఫీజులపై ఈ-వీసా జారీ చేస్తుంది. దీని గడువు 90 రోజులు. దరఖాస్తు చేసిన వారంలో వీసాను జారీ చేస్తారు.
రూ.3 వేల ఫీజుకు లభించే వియత్నాం వీసాతో అక్కడి గరిష్ఠంగా 90 రోజుల పాటు పర్యటించొచ్చు. వియత్నాం వైభవాన్ని ఎంజాయ్ చేసేందుకు ఇది సులువైన మార్గం
ఇండోనేషియా కూడా 30 రోజుల గడువుపై ఈ-వీసా జారీ చేస్తుంది. బాలీ బీచ్‌లు , బొరోబుదూర్ దేవాలయాలు, అగ్నిపర్వతాలను ఎంజాయ్ చేద్దామనుకుంటే ఈ-వీసాను ఎంచుకోవచ్చు
ఇక టర్కీ కూడా 90 రోజుల గడువుతో భారతీయులకు ఈ-వీసా జారీ చేస్తుంది. టర్కీ చారిత్రక వైభవం, మధ్యధరా సముద్ర తీర అందాలను చూసేందుకు ఈ-వీసాతో వెళ్లొచ్చు
ఇక రూ.2 వేల ఫీజు చెల్లిస్తే జపాన్ ఈ-వీసాను కేవలం వారం రోజుల్లో పొందొచ్చు. అక్కడి టెక్ రంగం, క్యోటోలోని టెంపుల్స్, ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఇది సులువైన మార్గం
ఇక 30 రోగుల గడువుతో లభించే ఈ-వీసాతో శ్రీలంకలోని బీచ్‌లు, ఇతర పర్యాటక ప్రాంతాలను చుట్టేసి రావచ్చు. దీని ఫీజు కేవలం రూ.2 వేలు
Updated Date - Sep 30 , 2025 | 10:49 PM