Assam Air Show: అస్సాం ఆకాశంలో ఎప్పటికీ చెరిపేయలేని, గర్వించదగిన చారిత్రాత్మక క్షణం!
ABN, Publish Date - Nov 09 , 2025 | 07:52 PM
భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ అస్సాం రాజధాని గౌహతిలో ఫ్లయింగ్ డిస్‌ప్లే విజయవంతంగా పూర్తైంది. ఈశాన్యంలో యుద్ధ సన్నాహాలు, కార్యకలాపాలను చేపట్టడానికి భారత వైమానిక దళం సన్నద్ధతను ఈ ప్రదర్శన రుజువు చేసింది.
అస్సాం ఆకాశంలో నేడు నిజంగా అద్భుతమైన రోజు
రాజధాని గౌహతిలో భారత వైమానిక దళం నిర్వహించిన మెగా ఎయిర్ షో
రాఫెల్ యుద్ధవిమానాల ఉరుములతో కూడిన గర్జన
తేజస్ యుద్ధవిమానాల జ్వలించే వేగం
భారత వైమానిక దళ అసమానమైన శౌర్యం, బలం, కచ్చితత్వాన్ని చూపిన ఎయిర్ షో
C-17, మిరాజ్-2000 వంటి విమానాలు దేశభక్తి, సైనిక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తూ చూపిన అపూర్వ ఘట్టం
వైమానిక ప్రదర్శన తిలకించేందుకు అశేషంగా తరలివచ్చిన జనం, నిర్వాహకుల సంతోషం
Updated Date - Nov 09 , 2025 | 07:53 PM