Lunar Eclipse Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయం వద్ద సంపూర్ణ చంద్రగ్రహణం దృశ్యాలు
ABN, Publish Date - Sep 08 , 2025 | 06:52 AM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆదివారం (సెప్టెంబర్ 7న రాత్రి) ఆకాశంలో అద్భుతమైన ఖగోళ దృశ్యం సంపూర్ణ చంద్రగ్రహణం ప్రత్యక్షమైంది. సహజసిద్ధమైన పర్వతాల మధ్య చంద్రుడు చక్కగా కనిపించాడు. ఈ అరుదైన క్షణాలను స్థానికులు తిలకించి, చంద్రుడిపై భూమి నీడ పడుతూ వచ్చే రంగుల మార్పులను వారి ఫోన్లలో క్లిక్ చేశారు. చంద్రగ్రహణం దృశ్యాలను ఈ ఫోటో గ్యాలరీలో చూద్దాం.
యాదగిరిగుట్ట ఆలయం వద్ద చంద్రగ్రహణం దృశ్యాలు
ఆలయం వద్ద అద్భుతంగా మెరిసిన చందమామ
రాత్రి ఆకాశంలో చంద్రుడు నీడలో మాయమైన అపురూప క్షణాలు
గుట్టపై నుంచి చంద్రగ్రహణం దృశ్యాలు
చంద్రుడి అద్భుత రూపం ఆకర్షణీయంగా కనిపించిన తీరు
గ్రహణ సమయంలో చంద్రుడు కనిపించిన దృశ్యం
ఆలయ వాతావరణంలో చంద్రగ్రహణం ఆధ్యాత్మిక రూపం
రాత్రి నీడలో చందమామ ఒక కొత్త రూపంలో దర్శనమిచ్చిన క్షణం
Updated Date - Sep 08 , 2025 | 06:54 AM