Kaleshwaram: కాళేశ్వరం క్షేత్రంలో పీఠాధిపతుల పుణ్యస్నానాలు
ABN, Publish Date - Dec 15 , 2025 | 05:30 PM
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే త్రివేణి సంగమం ఇది.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన కాళేశ్వరం క్షేత్రం
గోదావరి పరిక్రమణ యాత్రలో భాగంగా అయోధ్య, కాశీ, ప్రయాగ్, చిత్రకూట్, బృందావన్‌తో పాటు వివిధ ఆశ్రమాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు
నిన్న (ఆదివారం) రాత్రి కాళేశ్వరం చేరుకున్న పలువురు పీఠాధిపతులు, సన్యాసులు, సాధువులు
ఈ రోజు (సోమవారం) ఉదయం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి అభిషేకాలు చేశారు.
ఒకే పానవట్టంపై శివుడు-యముడు లింగాకారంలో వెలసిన విశిష్ట క్షేత్రమైన కాళేశ్వరం భక్తులను ఆకర్షిస్తోంది.
పూజల అనంతరం ఆలయ ఈవో మహేష్ స్వామివారి శేషవస్త్రంతో సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కాళేశ్వరంలో పీఠాధిపతులు, సన్యాసులు, సాధువుల పుణ్యస్నానాలు
Updated Date - Dec 15 , 2025 | 05:34 PM