Guru Nanak Dev Ji: గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ నుండి నిర్వహించిన గట్కా నైపుణ్యాల ప్రదర్శన (పవిత్ర ఊరేగింపు)
ABN, Publish Date - Nov 02 , 2025 | 08:40 AM
హైదరాబాద్‌లో సిక్కుల గట్కా ప్రదర్శన కేవలం యోధ కళా క్రీడకు మాత్రమే కాకుండా, గురునానక్ దేవ్‌జీ బోధనలైన 'ఏక్ ఓంకార్' (ఒకే దేవుడు) సందేశాన్ని యువతకు చాటి చెప్పింది. ఈ ఉత్సవం హైదరాబాద్‌లోని సిక్కు సమాజానికి సాంస్కృతిక గుర్తింపును ఇచ్చింది.
జంటనగరాల్లో మొదటి సిఖ్ గురు శ్రీ గురునానక్ దేవ్‌జీ 556వ ప్రకాశ ఉత్సవం
ప్రథమ సిక్కు గురువు శ్రీ గురునానక్ దేవ్‌జీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకునే పవిత్ర పండుగ
నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఐదు రోజులు ఆడంబరంగా నిర్వహించే పండుగ
గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన పవిత్ర ఊరేగింపు (నగర్ కీర్తన్)లో గట్కా నైపుణ్యాల ప్రదర్శన ప్రధాన ఆకర్షణ
ఈ ఉత్సవం గురూజీ బోధనలైన శాంతి, సమానత్వం, మానవత్వాన్ని ప్రతిబింబించడమే కాకుండా, సిక్కు సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రదర్శించింది
అందరికీ పవిత్రమైన గురు గ్రంథ్ సాహెబ్‌ను అలంకరించిన వాహనంపై భక్తిభావంతో ఊరేగించిన భక్తులు
మనోహర్ టాకీస్, క్లాక్ టవర్, బాటా, ప్యాట్నీ సర్కిల్, కింగ్స్‌వే, మొండా మార్కెట్, ఆల్ఫా హోటల్ మార్గాల గుండా ప్రయాణించి సాయంత్రానికి గురుద్వారాకు చేరుకుంది
ఈ సందర్భంగా 'జై తేగంగ్ గట్కా అఖారా' (అమృతసర్), 'దశ్మేష్ కల్గిధర్ జథా'ల సిక్కు యువకులు గట్కా ప్రదర్శనలు
గట్కా అనేది సిక్కు గురువులు బోధించిన ఆత్మరక్షణ, ధర్మరక్షణ ఆదర్శాలకు చిహ్నం
Updated Date - Nov 02 , 2025 | 08:40 AM