Vasant Panchami: కరీంనగర్‌లో మహాశక్తి ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
ABN, Publish Date - Feb 03 , 2025 | 11:06 AM
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా పోటెత్తిన భక్తులు సామూహిక అక్షరాభ్యాసాలు జరిపిస్తున్నారు. ఈ వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా ప్రాతఃకాల సమయంలోనే అమ్మవారికి అభిషేకం చేశారు. ఏకవార రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, పంచసూక్తాభిషేకాలను శాస్ర్తోకంగా చేపట్టారు.
అనంతరం సహస్రనామ కుంకుమార్చనలు, పుష్పార్చనలు, మహామంత్రపుష్పం, మహా నైవేద్యం, మహామంగళహారతులు వంటి తదితర పూజా కైంకర్యాలను జరిపారు.
ఆలయ ముఖ మండపంలో పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ సామూహిక అక్షరాభ్యాసాలు, బీజాక్షర క్రతువులను నిర్వహించారు.
పూజల్లో స్థానిక భక్తులు భారీగా పాల్గొన్నారు. సరస్వతి దేవి అమ్మవారికి విశేష పూజాదికాలు నిర్వహించారు.
ఆలయంలో సరస్వతి దేవి ఆవాహన పూజ, హోమం చేపట్టారు. పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Updated Date - Feb 03 , 2025 | 11:12 AM