Tirumala Brahmotsavam 2025: అత్యంత ఘనంగా బంగారు గొడుగు ఉత్సవం
ABN, Publish Date - Sep 30 , 2025 | 09:39 PM
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగింది.
శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు.
చంద్రగిరిరాజు శ్రీనివాస మహదేవ రాయలు చేసిన ధర్మ శాసనం ప్రకారం పంతులుగారి వంశస్తులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు.
తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై, అటు తరువాత 1952 నుండి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతున్నది.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, కల్యాణకట్ట డిప్యూటీ ఈవో పీ వెంకటయ్య, ఏఈవో సీఏ అమరనాధ్, సూపరింటెండెంట్ జీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 30 , 2025 | 09:44 PM