Oman Sports Event: ఒమాన్‌లో తెలుగు కళా సమితి క్రీడా పోటీలు
ABN, Publish Date - Sep 09 , 2025 | 09:59 PM
తెలుగువారి క్రీడాప్రతిభను వెలికి తీసేందుకు తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలు విజయవంతమయ్యాయి. ఈ ఈవెంట్‌లో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విదేశాలలోని ప్రవాసీయులకు క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే పరిచయం. ఇతర క్రీడలలో ప్రవేశం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఒమాన్‌లోని తెలుగు కళా సమితి ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల్లో తెలుగు ప్రవాసీయులలో దాగి ఉన్న క్రీడాప్రతిభను వెలికి తీయడానికి ఉపకరించాయి.
మస్కట్ నగరంలో జరిగిన పోటీల్లో బ్యాడ్మింటన్, చెస్, క్యారం తదితర క్రీడల్లో తెలుగు ప్రవాసీయులకు, వారి కుటుంబాలలో ఉన్న నైపుణ్యతను గుర్తించే కార్యక్రమానికి తెలుగు కళా సమితి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలను ప్రధానం చేసే కార్యక్రమంలో తెలుగు కళా సమితి అధ్యక్షుడు కొత్తూరు చిన్నారావు మాట్లాడుతూ ఇంటా బయట ఎక్కడ ఉన్నా క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంతో కీలక పాత్ర వహిస్తాయమని అన్నారు.
ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి మావేరిక్ స్పోర్ట్స్ ఆకాడమీ, ఆరోనా, సామ్స్, హోరైజన్ మీడియా, సంపంగిలు సౌజన్యకర్తలుగా వ్యవహరించారని నిర్వాహకులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గల్ఫ్‌లో గణనాథుల ఆరాధన.. కార్యక్రమాలను ముందుండి నడిపించిన గోదావరి జిల్లాల ఎన్నారైలు
భారతీయులకు మద్దతుగా అమెరికన్.. వాళ్లను పంపించేస్తే అమెరికాకే నష్టం అంటూ పోస్టు
Updated Date - Sep 10 , 2025 | 08:08 AM