NRI: తెలుగు కళా సమితి ఒమన్ ఆధ్వర్యంలో మస్కట్ సంగీత స్వరాలు
ABN, Publish Date - Jun 08 , 2025 | 09:27 PM
తెలుగు కళా సమితి ఒమన్ ఆధ్వర్యంలో, ఇండియన్ సోషల్ క్లబ్ (ISC) తెలుగు వింగ్ నిర్వహించిన 'మస్కట్ సంగీత స్వరాలు - ఎ మెగా మ్యూజికల్ అండ్ మ్యాజికల్ కచేరీ' కార్యక్రమం మే 31న బావ్‌షర్‌లోని సీబీఎఫ్ఎస్ కళాశాలలో అంగరంగ వైభవంగా జరిగింది.
మస్కట్: తెలుగు కళా సమితి ఒమన్ ఆధ్వర్యంలో, ఇండియన్ సోషల్ క్లబ్ (ISC) తెలుగు వింగ్ నిర్వహించిన 'మస్కట్ సంగీత స్వరాలు - ఎ మెగా మ్యూజికల్ అండ్ మ్యాజికల్ కచేరీ' కార్యక్రమం మే 31న బావ్‌షర్‌లోని సీబీఎఫ్ఎస్ కళాశాలలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి భారత రాయబారి గౌరవనీయులు హెచ్.ఇ.జి.వి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సినీ గాయకులు దీపు, లిప్సిక, కిరణ్ తమ గానంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయగా, ప్రముఖ మెజీషియన్ బి.ఎస్. రెడ్డి తన మ్యాజిక్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 1000 మంది తెలుగు అభిమానులు హాజరై విజయవంతం చేశారు.
తెలుగు వింగ్ కమిటీ సభ్యులు చిన్నారావు (కన్వీనర్), రాజశేఖర్ సూరపనేని (కో-కన్వీనర్), పవన్ ట్రెజరర్, అనిల్ జాయింట్ ట్రెజరర్, రాణి, చైతన్య, హరి, సంధ్య, అరుణ్, శ్రీకాంత్ ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.
ఇవి కూడా చదవండి:
రియాధ్‌లో టాసా ప్రతినిధుల సమావేశం
అమెరికాలో భారతీయ యువతికి షాక్.. ఏకంగా 5 వేల డాలర్ల నష్టం
Updated Date - Jun 08 , 2025 | 09:58 PM