ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Diaspora: మొత్తం 207 దేశాల్లో భారత సంతతి ప్రజలు.. కేంద్ర గణాంకాల్లో వెల్లడి

ABN, Publish Date - Sep 07 , 2025 | 09:28 PM

మొత్తం 207 దేశాల్లో భారత సంతతి ప్రజలు ఉన్నారని కేంద్రం తాజాగా వెల్లడించింది. వీరిలో సగం మంది ఎన్నారైలు కాగా మిగతా సగం మంది పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ గుర్తింపు ఉన్న వారని పేర్కొంది. గతేడాది ఎన్నారైలు భారత్‌కు సుమారు 135 బిలియన్ డాలర్ల నిధులు పంపించారని తెలిపింది.

India diaspora 2025 stats

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం 207 దేశాలకు భారత సంతతి వారు విస్తరించారు. విదేశాల్లో ఉంటున్న మొత్తం భారత సంతతి వ్యక్తుల సంఖ్య 3.43 కోట్లకు చేరింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. వీరిలో 1.71 కోట్ల మందికి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐఓ) గుర్తింపు ఉండగా మిగిలిన వారు ఎన్నారైలు (Indian Diaspora Stats).

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, విదేశాల్లో ఉంటున్న భారతీయ సంతతి వారిలో అత్యధికులు అమెరికాలో ఉంటున్నారు. అక్కడి వారి సంఖ్య 56.9 లక్షలు. ఆ తరువాత స్థానంలో యూఏఈ (38.9 లక్షలు), సౌదీ అరేబియా (27.5 లక్షలు), మలేషియా (29.3 లక్షలు) ఉన్నాయి. శ్రీలంకలో 16.1 లక్షలు, దక్షిణాఫ్రికాలో 13.9 లక్షలు, యూకేలో 13.4 లక్షలు, కెనడాలో 36.1 లక్షలు, కువైత్‌లో 10.1 లక్షలు, సింగపూర్‌లో 4.6 లక్షల మంది ఉన్నారు. విదేశాల్లోని భారత సంతతి వారిలో దాదాపు సగం మంది ఈ పది దేశాల్లో ఉంటున్నారు.

ఇక ఎన్నారైల్లో అత్యధిక శాతం మంది గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. యూఏఈ సౌదీ అరేబియా, కువైత్‌లో ఉంటున్న భారతీయుల సంఖ్య 76.5 లక్షలు. ఇక పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ వ్యక్తులు పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న పీఐఓల్లో 60 శాతం (సుమారు 66 లక్షలు) అమెరికా, కెనడా, యూకేల్లో ఉంటున్నారు. ఇక చిన్న దేశాలైన మారిషస్ (8.9 లక్షలు), ఫీజీ (3.1 లక్షలు), ట్రినిడాడ్ అండ్ టొబాకో (5.4 లక్షలు), గయానా (3.2 లక్షలు)లో కూడా భారతీయులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటున్నారు.

భారత ఆర్థిక రంగంపై ఎన్నారై, పీఐఓల ప్రభావం ఎక్కువగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రాకరం, విదేశాల్లో ఉంటున్న భారతీయులు 2024-25లో స్వదేశానికి 135.6 బిలియన్ డాలర్లు పంపించారు. ఫలితంగా, ఈ కేటగిరీలో భారత్ దశాబ్ద కాలంగా ప్రపంచంలో నెం.1గా నిలుస్తోందని వరల్డ్ బ్యాంకు గతంలో వెల్లడించింది. ఆర్థికరంగంతో పాటు ఎన్నారైలతో సాంస్కృతిక, విద్యారంగ సంబంధాలకు కూడా భారత్ ప్రాధాన్యమిస్తోంది. ఈ దిశగా వివిధ దేశాల్లో 38 ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే, భారతీయ సంతతి వారు అత్యధికంగా ఉన్న అమెరికా ఇలాంటి సెంటర్స్ లేకపోవడం కొసమెరుపు. ఇలాంటి దేశాల్లో ఎంబసీ అధికారులే సాంస్కృతి సంబంధ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు.

ఈ వార్తలు కూడా చదవండి:

భారతీయులకు మద్దతుగా అమెరికన్.. వాళ్లను పంపించేస్తే అమెరికాకే నష్టం అంటూ పోస్టు

గల్ఫ్ దేశాలు తెలంగాణ వారికి ఉపాధిని ఇచ్చే కల్పతరువు: మంత్రి గడ్డం వివేక్

Read Latest and NRI News

Updated Date - Sep 07 , 2025 | 09:36 PM