ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kapil Haryana Shot In US: బహిరంగ మూత్ర విసర్జన వద్దన్నందుకు కాల్పులు.. అమెరికాలో భారతీయ యువకుడి మృతి

ABN, Publish Date - Sep 08 , 2025 | 02:55 PM

అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బహిరంగ మూత్ర విసర్జన వద్దని వారించినందుకు ఒక స్థానికుడు భారతీయ యువకుడిని కాల్చి చంపాడు. కాలిఫోర్నియాలో శనివారం ఈ దారుణం జరిగింది.

Haryana Man Shot Dead In California

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కాలిఫోర్నియాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బహిరంగ మూత్ర విసర్జన చేయవద్దని ఓ అమెరికన్‌ను వారించడంతో అతడు యువకుడిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. మృతుడిని హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాకు చెందిన కపిల్‌(26)గా గుర్తించారు (Haryana man shot California).

కపిల్ డ్యూటీలో ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న నిందితుడిని వద్దని వారించడంతో అతడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కపిల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినా కపిల్ ప్రాణాలు నిలవలేదు (public urination intervention shooting).

కపిల్ మరణంతో అతడి స్వగ్రామం బారా కాలాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘బహిరంగ మూత్ర విసర్జన వద్దని వారించినందుకే నిందితుడు కాల్పులు జరిపాడు’ అని మృతుడి బంధువు కన్నీరుమున్నీరయ్యారు. కపిల్ 2000 మే 22న జన్మించాడు. డంకీ మార్గంలో 2022లో అమెరికాకు వెళ్లాడు. అతడిది రైతు కుటుంబం.

కపిల్ తల్లిదండ్రులు దాదాపు రూ.45 లక్షలు ఖర్చు పెట్టి అతడిని అమెరికాకు పంపించారు. తాము పొదుపు చేసిన సొమ్మంతా కపిల్‌ కోసం వినియోగించారు. ప్రస్తుతం అతడి మృతదేహాన్ని భారత్‌కు తరలించడం కూడా వారికి కష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల్లో కూరుకుపోయామని బంధువులు వాపోయారు. కపిల్‌పై కాల్పులు జరిపిన నిందితుడి వివరాలను స్థానిక పోలీసులు ఇంకా విడుదల చేయలేదు. నిందితుడిని అరెస్టు చేశారా?, లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి:

మొత్తం 207 దేశాల్లో భారత సంతతి ప్రజలు.. కేంద్ర గణాంకాల్లో వెల్లడి

భారతీయులకు మద్దతుగా అమెరికన్.. వాళ్లను పంపించేస్తే అమెరికాకే నష్టం అంటూ పోస్టు

Read Latest and NRI News

Updated Date - Sep 08 , 2025 | 04:57 PM