ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bahrain: మరణించిన అయిదెళ్ల తర్వాత.. బహ్రెయిన్‌లో ఇద్దరు తెలుగు మహిళలకు దహన సంస్కరాలు

ABN, Publish Date - Aug 20 , 2025 | 05:40 PM

ఏడడుగుల బంధం ఎడారి దేశాలకు వచ్చేసరికి ఎండమావులవుతుంది. సంపాదన కోసం ఎడారి దేశాలకు వచ్చిన తర్వాత స్వంత వారే పట్టించుకోవడం లేదు. బహ్రెయిన్‌లో ఇద్దరు ప్రవాసాంధ్ర మహిళలకు ఎదురైన పరిస్థితి గురించి తెలుసుకుంటే హృదయం భారం అవక మానదు.

Bahrain News

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఏడడుగుల బంధం ఎడారి దేశాలకు వచ్చేసరికి ఎండమావులవుతుంది. సంపాదన కోసం ఎడారి దేశాలకు వచ్చిన తర్వాత స్వంత వారే పట్టించుకోవడం లేదు. బహ్రెయిన్‌లో ఇద్దరు ప్రవాసాంధ్ర మహిళలకు ఎదురైన పరిస్థితి గురించి తెలుసుకుంటే హృదయం భారం అవక మానదు. బహ్రెయిన్‌లో అయిదెళ్ల క్రితం మరణించిన ఆ ఇద్దరి మృతదేహాలకు బుధవారం దహన సంస్కారాలు జరిగాయి. ఎవరి కోసం డబ్బులు సంపాదించాలని ఈ ఇద్దరూ బహ్రెయిన్ వచ్చారో వారే పట్టించుకోవడం మానేయడంతో వీరికి ఈ పరిస్థితి ఎదురైంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, అనకాపల్లి జిల్లాలకు చెందిన ఈ ఇద్దరు మహిళల కుటుంబ సభ్యుల అలసత్వం కారణంగా అయిదేళ్లుగా వీరి మృతదేహాలు బహ్రెయిన్‌లో ఉండిపోయాయి. తాజాగా బహ్రెయిన్ ప్రభుత్వ చొరవతో పాటు, భారతీయ ఎంబసీ, మంగళగిరిలోని ఏపి ఎన్నార్టీస్ సంస్ధ సమన్వయం చేయడంతో వీరి మృతదేహాలకు ఎట్టకేలకు దహన సంస్కారాలు జరిగాయి. బహ్రెయిన్‌లోని ప్రముఖ సామాజిక సేవకుడు దొర్నాల శివకుమార్ అన్ని తానై ఈ ఇద్దరు మహిళలకు బుధవారం బహ్రెయిన్‌లో దహన సంస్కరాలు చేయడం జరిగింది.

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పరింపూడి గ్రామానికి చెందిన 32 ఏళ్ల సత్యవతి కొరడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామానికి చెందిన 52 ఏళ్ల పైడమ్మ వాకాడ గుండెపోటుతో 2020 సంవత్సరంలో మరణించారు. అప్పటి నుంచి వీరి మృతదేహాలను బహ్రెయిన్ ప్రభుత్వం భద్రపర్చి ఉంచింది. కుటుంబ సభ్యులు మృతదేహలను స్వీకరించడానికి నిరాకరించారు. స్ధానికంగా దహన సంస్కారాలు చేయడానికి అవసరమైన ఆంగీకార పత్రాలను కూడా పంపించలేదు. దీంతో మృతదేహాలను ఫ్రీజర్‌లో ఐదేళ్ల పాటు అలాగే ఉంచేశారు.

బహ్రెయిన్ ప్రభుత్వం ఆ ఇద్దరు మహిళల మృతదేహాల గురించి భారత ఎంబసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎన్నార్టీస్ సంస్ధ దృష్టికు తీసుకెళ్లింది. దీంతో సంబంధిత జిల్లాల కలెక్టర్లు మృతుల కుటుంబాలను సంప్రదించి అవసరమైన పత్రాలను పంపించారు. దీంతో ఈ ఇద్దరు పేద మహిళలకు అంతిమంగా దహన సంస్కారాలు జరిగాయి. భారతీయ ఎంబసీ పక్షాన వికాస్, లాల్ ప్రత్యేక శ్రధ్ధ వహించారు. ఏపీ ఎన్నార్టీస్‌కు చెందిన వెంకట రెడ్డి కుటుంబాలను సంప్రదించారు. అలాగే బహ్రెయిన్ లోని తెలుగు కళా సమితి, ఐసీఆర్‌ఎఫ్ ప్రవాసీ సంఘం కూడా సహాకరించడంతో శివకుమార్ ఈ దహన సంస్కారాలు చేశారు. బహ్రెయిన్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆనాథల మృతదేహాలన్నింటికీ కాకినాడకు చెందిన శివకుమార్ దగ్గరుండి దహాన సంస్కారాలు చేస్తుంటారు.

Updated Date - Aug 20 , 2025 | 08:27 PM