ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్న వయసులో పెద్ద మనసు

ABN, Publish Date - Jun 04 , 2025 | 06:34 AM

దాచుకున్న డబ్బుతో పిల్లలు బొమ్మలు, చాక్లెట్లు కొనుక్కుంటారు. కానీ మేఘాలయకు చెందిన ఏడేళ్ల ఆభా నోంగ్రమ్‌, పొదుపు చేసిన డబ్బుతో క్షయ రోగుల కోసం పోషకాహార కిట్లను సేకరించడం మొదలుపెట్టింది. చిన్న వయసుతో పెద్ద మనసుతో ఆలోచించిన ఆ పాప కథనమిది.

స్ఫూర్తి

దాచుకున్న డబ్బుతో పిల్లలు బొమ్మలు, చాక్లెట్లు కొనుక్కుంటారు. కానీ మేఘాలయకు చెందిన ఏడేళ్ల ఆభా నోంగ్రమ్‌, పొదుపు చేసిన డబ్బుతో క్షయ రోగుల కోసం పోషకాహార కిట్లను సేకరించడం మొదలుపెట్టింది. చిన్న వయసుతో పెద్ద మనసుతో ఆలోచించిన ఆ పాప కథనమిది.

క్షయ వ్యాఽధిని సమూలంగా తరిమికొట్టాలనే లక్ష్యంతో అలుపెరగని పోరాటానికి పూనుకున్న దేశం మనది. ఎన్ని ఆరోగ్య సేవలను అందించినా, ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ఈ వ్యాధి ఇప్పటికీ ప్రజల ఆరోగ్యాలను కుదేలు చేస్తూనే ఉంది. సమర్థమైన మందులు ఉన్నప్పటికీ, తగిన పోషకాహారం కరవవడంతో ఈ వ్యాధి, ఏళ్ల తరబడి వేధిస్తూ, రోగులను మరణానికి చేరువ చేస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన రెండో తరగతి చదువుతున్న ఆభా, వ్యాధి నుంచి కోలుకోవడానికి తోడ్పడే పోషకాహారాన్ని క్షయ రోగులకు అందించాలనుకుంది. ఈ సంకల్పంతో తల్లితండ్రులు, బంధువులు ఇచ్చే జేబు డబ్బును పొదుపు చేసి, క్షయ రోగులకు పంచడం కోసం న్యూట్రిషన్‌ కిట్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టింది.


  • ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించి...

ఏదో ఒకనాటికి క్షయ రోగులను ప్రత్యక్షంగా కలుస్తాననే ఆశతో పోషకాహార మద్దతును అందించడంతో పాటు, క్షయ వ్యాధి వ్యతిరేక పోరాటంలో తన వంతుగా సహాయపడుతోంది ఆభా. ఈ పాప ప్రయత్నం మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ కె. సంగ్మాను కూడా ఆకర్షించింది. సంగ్మా, ఆభా కథను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడమే కాకుండా ఈ పాపను ఒక రోల్‌ మోడల్‌గా అభివర్ణించారు. ‘‘మేఘాలయకు చెందిన యువ క్షయ హీరోను కలవండి. ఏడేళ్లకే ఆభా నంగ్రమ్‌, తన జేబు డబ్బుతో న్యూట్రిషనల్‌ ప్యాక్‌లతో క్షయ రోగులకు సహాయపడుతోంది’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆభా మీద ప్రశంసలు కురిపించారు. రెండో తరగతి విద్యార్థిని ఆభా, మారథాన్‌ విజేత, తైౖక్వాండో ఛాంపియన్‌ కూడా! ఈ పాప తైక్వాండోలో రాష్ట్ర స్థాయిలో రజత పతకాన్ని సాధించింది. ఐదేళ్ల వయసుకే మారథాన్‌లో గెలుపొందింది.

  • వేల మంది ప్రతిన పూని...

దేశ వ్యాప్తంగా 2,54,000 మంది నిక్షయ్‌ మిత్రలు ఉన్నారు. వీరిలో ఆభాతో సహా మరో 314 మంది మేఘాలయలోనే ఉన్నారు. వీళ్లందరూ క్షయ రోగుల మద్దతుకు సమిష్ఠిగా ప్రతిజ్ఞ పూనారు. క్షయ వ్యాధి పట్ల సమాజంలో నెలకొని ఉన్న అపోహలు, భయాలు తొలగి, క్షయ రహిత భారతదేశం దిశగా సాగించే పోరాటంలో సమాజ భాగస్వామ్యం ప్రాముఖ్యతను వీళ్లందరూ చాటుతూ ఉండడం విశేషం.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 06:34 AM