ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువతుల్లో గుండెపోట్లు ఎందుకు

ABN, Publish Date - Jun 10 , 2025 | 06:02 AM

ఇటీవల ముంబయిలో 29 ఏళ్ల యువతి గుండెపోటుకు గురైంది. తక్షణం స్పందించిన వైద్యులు స్టెంట్‌తో ఆమె ప్రాణాలను కాపాడగలిగారు. కానీ సాధారణంగా పిల్లలను కనే వయసు యువతులకు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ వల్ల...

అవగాహన

ఇటీవల ముంబయిలో 29 ఏళ్ల యువతి గుండెపోటుకు గురైంది. తక్షణం స్పందించిన వైద్యులు స్టెంట్‌తో ఆమె ప్రాణాలను కాపాడగలిగారు. కానీ సాధారణంగా పిల్లలను కనే వయసు యువతులకు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ వల్ల గుండెకు రక్షణ దక్కుతూ ఉంటుంది. కానీ ఈ యువతి విషయంలో ఆ రక్షణ లోపించడానికి వైద్యులు ఆసక్తికరమైన కారణాలను వివరించారు.

ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ రక్తనాళాలను విప్పార్చి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కాబట్టే ఈ హార్మోన్‌ స్రావాలు సక్రమంగా స్రవించే యువతుల్లో గుండె సమస్యలు తక్కువ. కానీ నేడు యువతుల్లో పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ సమస్య సర్వసాధారణమైపోతోంది. ఈ హార్మోన్‌ అసమతౌల్యం వల్ల నెలసరి క్రమం తప్పడంతో పాటు ఒవేరియన్‌ సిస్టులు కూడా ఏర్పడతాయి. ఈ సమస్యను సరిదిద్దడం కోసం ఈస్ట్రోజన్‌ ప్రొజెస్టిన్‌ హార్మోన్లు కలిగి ఉండే గర్భనిరోధక మాత్రలను వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఈ మాత్రలు ఇష్కిమిక్‌ స్ట్రోక్‌, గుండె పోటుకు దారితీస్తూ ఉంటాయి.

ఆ మాత్రల వల్లే...

ఏడాది పాటు ఈ మాత్రలను వాడుకునే ప్రతి 4,760 మంది మహిళలకు ఒక అదనపు స్ట్రోక్‌ ముప్పు ఉంటుందనీ, ప్రతి పది వేల మంది మహిళలకూ ఒక అదనపు గుండె పోటు ముప్పు ఉంటుందనీ అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఈస్ట్రోజన్‌ను కలిగి ఉండే వెజైనల్‌ రింగ్స్‌, చర్మపు ప్యాచ్‌లతో ఈ ముప్పు మరింత ఎక్కువ. ఈ పరిస్థితి గురించి వివరిస్తూ.. ‘‘గర్భనిరోధక మాత్రలతో సంబంధం ఉన్న గుండెపోట్ల కంటే స్ట్రోక్స్‌ అత్యంత సాధారణమైపోయాయి. పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడే 22 నుంచి 28 ఏళ్ల యువతులు స్ట్రోక్‌ గురవడాన్ని నేను చూశాను. అయితే అండాల విడుదలను నిలువరించడం ద్వారా అండాశయాల్లో సిస్టులు ఏర్పడే అవకాశాలను తగ్గించడం కోసం మహిళలు గర్భనిరోధక మాత్రలను వాడుకోవలసిన అవసరం ఉంటుంది’’ అంటూ గైనకాలజిస్ట్‌, డాక్టర్‌ కిరణ్‌ కోల్హో వివరిస్తున్నారు. ‘‘ఊబకాయం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ సమస్యలు కూడా పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌తో ముడిపడి ఉంటాయి. ఫలితంగా రక్తంలో కొవ్వు మోతాదులు ఎక్కువగా ఉండి, గుండె జబ్బు ముప్పును పెంచే పిస్లిపిడీమియా సమస్య కూడా వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నగరాల్లోని మహిళల్లో అత్యధిక ఒత్తిడి మోతాదులు, బాల ఊబకాయ సమస్యలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ కారకాలు, పట్టణ భారతదేశంలోని ప్రతి ఐదుగురు కౌమార బాలికల్లో ఒకరికి, పిసిఒ అవకాశాలను మరింత పెంచుతున్నాయి’’ అని కూడా అంటున్నారామె.

కుటుంబ చరిత్ర తెలుసుకుని...

నానావతి హాస్పిటల్‌ హృద్రోగ వైద్యులు డాక్టర్‌ రాజీవ్‌ భగవత్‌... ‘‘యువతుల్లో గుండెపోట్లు, స్ట్రోక్స్‌ ముప్పు తగ్గాలంటే, గర్భనిరోధక మాత్రలను సూచించే సందర్భంలో వైద్యులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ మాత్రలు రక్తపు గడ్డలను పెంచే అవకాశాలున్నాయి కాబట్టి, వాటిని సూచించే ముందు మహిళ కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, ఆ తర్వాతే ఆ మాత్రలను సూచించాలి’’ అని అంటున్నారు.

ఊబకాయం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ సమస్యలు కూడా పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌తో ముడిపడి ఉంటాయి. ఫలితంగా రక్తంలో కొవ్వు మోతాదులు ఎక్కువగా ఉండి, గుండె జబ్బు ముప్పును పెంచే పిస్లిపిడీమియా సమస్య కూడా వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నగరాల్లోని మహిళల్లో అత్యధిక ఒత్తిడి మోతాదులు, బాల ఊబకాయ సమస్యలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ కారకాలు, పట్టణ భారతదేశంలోని ప్రతి ఐదుగురు కౌమార బాలికల్లో ఒకరికి, పిసిఒ అవకాశాలను మరింత పెంచుతున్నాయి

ఇవి కూడా చదవండి

ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 06:02 AM