అరచేతుల్లో దురద ప్రమాదమా
ABN, Publish Date - Jun 22 , 2025 | 05:51 AM
ఒక్కోసారి అరచేతుల్లో విపరీతంగా దురద వస్తూ ఉంటుంది. ఇది కొన్ని అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు...
ఒక్కోసారి అరచేతుల్లో విపరీతంగా దురద వస్తూ ఉంటుంది. ఇది కొన్ని అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.
ఎగ్జిమా, సొరియాసిస్, తామర లాంటి చర్మ వ్యాధుల వల్ల అరచేతుల్లో దురద రావచ్చు. ఇలాంటప్పుడు గట్టిగా గోకడం వల్ల అరచేతుల్లో చర్మం ఎర్రగా మారి పొలుసులుగా రాలుతుంది.
సబ్బులు, డిటర్జెంట్లు, లోషన్లు సరిపడని కారణంగా అరచేతుల్లో అలెర్జీ ఏర్పడి దురద వస్తూ ఉంటుంది. కొన్ని రకాల లోహాలు, రసాయనాలు, మొక్కలను తాకినా ఈ సమస్య వస్తుంది. ఇది అంత ప్రమాదం కాదు. ఐస్ ముక్కతో అరచేతుల్లో రుద్దితే రెండు రోజుల్లో తగ్గిపోతుంది.
చేతులను తరచూ సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో కడుగుతున్నా, శానిటైజర్‌ను ఎక్కువగా వాడుతున్నా అరచేతుల్లో తేమ తగ్గి దురద రావచ్చు. ఇలాంటప్పుడు మాయిశ్చరైజర్ కొద్దిగా రాసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
కాలేయ సమస్యలు, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం, థైరాయిడ్ కారణంగా అరచేతుల్లో దురద వస్తుంది.
శరీరంలో తేమ తక్కువైతే చర్మం పొడిబారుతుంది. దీనివల్ల కూడా అరచేతులు దురద పెడుతుంటా యి. ఒత్తిడి, మానసిక ఆందోళన, మధుమేహం, నరాల సమస్యలు కూడా కారణం కావచ్చు.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 22 , 2025 | 05:51 AM