ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఊబకాయ ఇంజెక్షన్ల ప్రభావం ఎప్పుడంటే

ABN, Publish Date - Jun 24 , 2025 | 05:31 AM

అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఒజెంపిక్‌ బ్రాండుతో చలామణీలో ఉన్న సెమాగ్లూటామైడ్‌ ఇంజెక్షన్లను వాడకం ఊపందుకున్న తరుణంలో, బరువు తగ్గుదలపై ఈ ఇంజెక్షన్లు కనబరిచే ప్రభావానికి...

పరిశోధన

అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఒజెంపిక్‌ బ్రాండుతో చలామణీలో ఉన్న సెమాగ్లూటామైడ్‌ ఇంజెక్షన్లను వాడకం ఊపందుకున్న తరుణంలో, బరువు తగ్గుదలపై ఈ ఇంజెక్షన్లు కనబరిచే ప్రభావానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..

అధిక బరువును తగ్గించడం కోసం, టైప్‌2 మధుమేహాన్ని అదుపులో ఉంచడం కోసం ఒజెంపిక్‌ బ్రాండ్‌ పేరుతో సెమాగ్లూటామైడ్‌ ఇంజెక్షన్‌ను వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ఈ ఇంజెక్షన్‌ ప్రభావం గురించి చేపట్టిన అధ్యయనాల్లో, బరువును తగ్గించుకోవడం కోసం వైద్యపరమైన జాగ్రత్తలు పాటించిన వాళ్లతో పోలిస్తే, సెమిగ్లూటామైడ్‌ లేదా, టిర్జెపాటైడ్‌ ఇంజెక్షన్లను తీసుకున్న వారు తక్కువ బరువు కోల్పోయినట్టు తేలింది. చికిత్సను మధ్యలోనే విరమించుకోవడం లేదా తక్కువ డోసులను వాడుకోవడం ఇందుకు ప్రధాన కారణం కావచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఔషధం ప్రభావాన్ని పూర్తి స్థాయిలో కనబరిచే డోసును తీసుకున్నప్పుడు సెమాగ్లూటైడ్‌ తీసుకున్న వారు, వారి శరీరంలో 13.7 శాతం బరువును కోల్పోయినట్టు, టిర్జెపాటైడ్‌ తీసుకున్న వారు వారి శరీరంలో 18 శాతం బరువును కోల్పోయినట్టు పరిశోధకులు ప్రయోగాల ద్వారా కనిపెట్టారు. చికిత్సను ఆపకుండా కొనసాగించిన వారు, అత్యధిక డోసును తీసుకున్న వారు ఏడాదిలో పది శాతం శరీర బరువును కోల్పోయినట్టు కూడా పరిశోధకులు కనిపెట్టారు. ఇంజెక్సన్‌ వాడకాన్ని మధ్యలోనే విరమించుకోవడానికి ఇంజెక్షన్‌ అధిక ధరే కారణమని కూడా పరిశోధకులు కనిపెట్టారు.

ఇవి కూడా చదవండి..

అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 05:31 AM