పర్ఫ్యూమ్‌లు ఎక్కువగా వాడుతున్నారా
ABN, Publish Date - May 11 , 2025 | 05:00 AM
మనం సాధారణంగా పర్ఫ్యూమ్‌లు లేదా బాడీ స్ర్పేలు వాడుతూ ఉంటాం. ఇవి చుట్టూ సువాసనలు వెదజల్లుతూ తాజా అనుభూతిని కలిగిస్తాయి. వీటి వాడకం మంచిదే అయినప్పటికీ మితిమీరితే మాత్రం...
మనం సాధారణంగా పర్ఫ్యూమ్‌లు లేదా బాడీ స్ర్పేలు వాడుతూ ఉంటాం. ఇవి చుట్టూ సువాసనలు వెదజల్లుతూ తాజా అనుభూతిని కలిగిస్తాయి. వీటి వాడకం మంచిదే అయినప్పటికీ మితిమీరితే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు...
ఫ పర్ఫ్యూమ్‌లో.... ఈథైల్ ఆల్కహాల్ ప్రధాన ద్రావకంగా ఉంటుంది. దీనితోపాటు చెట్లకు చెందిన భాగాలు, పూల మొగ్గల నుంచి తయారు చేసిన నూనెలు కలిసి ఉంటాయి. వీటిని ఎక్కువగా పీల్చడం వల్ల తుమ్ములు, ముక్కులో మంట, కళ్ల నుంచి నీళ్లు కారడం లాంటి సమస్యలు వస్తాయి.
కొన్ని రకాల బాడీ స్ర్పేలు, పర్ఫ్యూమ్‌లలో రసాయనాలు ఉంటాయి. ఇవి గాలి ద్వారా శ్వాసనాళాల్లోకి ప్రవేశించి దగ్గు, ఛాతిలో మంటను కలిగిస్తాయి. ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఎప్పుడూ జలుబు సమస్యలు వేధిస్తుంటాయి.
పర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మం మీద చల్లుకున్నప్పుడు దానిలోని కృత్రిమ నూనెల వల్ల చర్మం పొడిబారడం, మంటగా అనిపించడం, దద్దుర్లు, అలెర్జీ లాంటి సమస్యలు ఏర్పడవచ్చు.
గాఢమైన పరిమళం ఉన్న పర్ఫ్యూమ్‌లను ఎక్కువగా వాడుతుంటే తలనొప్పి, వాంతులు, ముక్కు దిబ్బడ రావచ్చు. కళ్లు తిరగడంతోపాటు కడుపులో వికారంగా అనిపించవచ్చు. కండరాల వణుకు లాంటి నరాల సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు.
రసాయనభరితమైన పర్ఫ్యూమ్‌లను మితిమీరి వాడితే హార్మోన్ల స్థాయిలో అసమతుల్యత ఏర్పడి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఆస్తమా ఉన్నవారు వీటిని వాడితే శ్వాస సమస్యలు, ఆయాసం ఎక్కువ అవుతాయి.
గర్భిణులు కూడా వైద్యుని సలహా మేరకు మాత్రమే వీటిని వాడాలి. లేదంటే కడుపులోని బిడ్డకు శ్వాసనాళాల సమస్యలు తప్పవు.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: ఇండియాతో ఉద్రిక్తత..దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి, కేజీ ఉల్లి రూ.300
India Pakistan Tensions: పాకిస్తాన్ను పట్టించుకోని అమెరికా..దాడులు ఆపించాలని వేడుకున్నా కూడా..
Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
యుద్ధం నేనే ఆపాను: కేఏ పాల్
Updated Date - May 11 , 2025 | 05:00 AM