ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Art Directors in Cinema: ఒక్కో సినిమా వెనుకా ఒక్కో కథ

ABN, Publish Date - Jul 13 , 2025 | 04:15 AM

తెలుగు పరిశ్రమ గర్వించదగిన కళాదర్శకులలో పద్మశ్రీ తోట తరణి ఒకరు. ‘అమావాస్య చంద్రుడు’, ‘నాయకన్‌’, ‘సాగరసంగమం’, ‘చెప్పాలని ఉంది’... ఇలా వైవిధ్యభరితమైన అనేక కథాంశాలకు ఆయన...

సండే సెలబ్రిటీ

తెలుగు పరిశ్రమ గర్వించదగిన కళాదర్శకులలో పద్మశ్రీ తోట తరణి ఒకరు. ‘అమావాస్య చంద్రుడు’, ‘నాయకన్‌’, ‘సాగరసంగమం’, ‘చెప్పాలని ఉంది’... ఇలా వైవిధ్యభరితమైన అనేక కథాంశాలకు ఆయన పనిచేశారు. తాజాగా ఆయన కళాదర్శకత్వం వహించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ‘నవ్య’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలలోకి వెళ్తే...

‘హరిహర వీరమల్లు’ సినిమా ఎలాంటి అనుభవాన్ని మిగిల్చింది?

ఇది నేను కళ్యాణ్‌గారితో కలిసి చేస్తున్న తొలి సినిమా. చిరంజీవిగారితో అనేక సినిమాలు చేశా. కళ్యాణ్‌గారు నాకు చాలాకాలంగా తెలుసు. కానీ తొలిసారి కలిసి పనిచేస్తున్నా. ఆయన షూటింగ్‌లో చిన్న చిన్న విషయాలమీద కూడా చాలా శ్రద్ధ చూపిస్తారు. ఈ సినిమా అనుకున్న సమయం కన్నా ఆలస్యమయింది. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాం. అయినా మా శక్తియుక్తులన్నీ పెట్టి పనిచేశాం. ఇక్కడ నిర్మాత ఏ.ఎం.రత్నంగారి గురించి కూడా చెప్పాలి. షూటింగ్‌ ఆలస్యమయినా తట్టుకొని నిలబడ్డారు. అందుకే ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా.

ఈ సినిమాకు సంబంధించి మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏవైనా ఉన్నాయా?

సాధారణంగా నేను దేన్నీ సవాలుగా భావించను. దీనికి ఒక కారణం ఉంది. చాలా సందర్భాలలో సెట్‌ను పూర్తిచేయకపోవటం అనేది తగినంత సమయం లేకపోవటం వల్ల జరుగుతుంది. అదేమిటో తెలియదు కానీ... నేను పనిచేసే సినిమాలకు ఎక్కువ సమయం ఇచ్చేవారు కాదు. దీంతో తక్కువ సమయంలోనే సినిమా పూర్తి చేయాల్సి వచ్చేది. అది అలవాటు అయిపోయింది. ఈ సినిమా విషయానికి వస్తే - ఒక్క రోజులో మొత్తం సెట్‌ను మార్చేయాల్సి వచ్చింది. రత్నంగారు కూడా ఆ రోజంతా నాతో పాటే ఉన్నారు.

కళాదర్శకుడిగా మీరు సవాల్‌గా భావించిన సినిమా ఏదైనా ఉందా?

లేదు. అలాంటి సినిమా గురించే ఎదురుచూస్తున్నా. ‘హరిహర వీరమల్లు’ పూర్తయింది కాబట్టి నాలుగు నెలలు ఖాళీగా ఉందామనుకుంటున్నా. ఈ సమయంలో నాకు నచ్చిన పెయింటింగ్స్‌ నేను వేసుకుంటా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఒక పెయింటింగ్‌ వేస్తే కొద్దిమందిని మాత్రమే ఆనందపరచగలుగుతాను. కానీ ఆర్ట్‌ డైరక్టర్‌గా వందలమందికి ఉపాధి కల్గించగలుగుతాను అందుకే నేను చిన్న సినిమాలూ చేస్తాను, పెద్ద సినిమాలూ చేస్తాను. బడ్జెట్‌ గురించి పట్టించుకోను.

సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత మీరు

మరచిపోలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?

సింగీతం శ్రీనివాసరావు గారిని మర్చిపోలేను. ఆయన దర్శకత్వం వహించిన ఒక సినిమాకు మా నాన్నగారు తోట వెంకటేశ్వరరావుగారు కళాదర్శకులు. దాని కోసం రెండు సెట్స్‌ వేసి పాటలు చిత్రీకరించారు. నేను అప్పుడు ‘హ్యాండ్‌లూమ్‌ బోర్డు’లో ‘ఏ-గ్రేడ్‌ డిజైనర్‌’గా పనిచేసేవాణ్ణి. మంచి ఉద్యోగం. ఒక రోజు నాన్నగారు, తమ్ముడు ఊర్లో లేకపోతే... సెట్‌ పనులు చూసుకుందామని షూటింగ్‌కు వెళ్లాను. అక్కడ సింగీతం గారు నన్ను చూసి- ‘‘నువ్వెందుకు వచ్చావు? నువ్వు పెయింటర్‌వి. వెళ్లి ఉద్యోగం చేసుకో’’ అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఒక రోజు ఆయన- ‘’నేను, కమల్‌ వస్తాం. నీతో మాట్లాడాలి’’ అని కబురు పెట్టారు. అసలే కోపం మీద ఉన్నా కదా.. ‘‘నేను కలవను’’ అని తిరిగి కబురు పంపించా. ఆ తర్వాత కొందరు నాకు సర్దిచెప్పాక... మేము కలుసుకున్నాం. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి చేసిన సినిమాయే... ‘అమావాస్య చంద్రుడు. దీనిలో హీరో పెయింటర్‌. అందుకే ఆయన నన్ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ రెండేళ్లు సాగింది. ఆ తర్వాత ఏడిద నాగేశ్వరరావుగారు వచ్చి అడిగారు. ముందు చేయనన్నాను. ఆ తర్వాత చేశాను. ఇలా నేను చేసిన ఒకో సినిమాకు ఒకో కథ ఉంది. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాకు మొత్తం పనిచేసినందుకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు చాలామంది రోజుకు ఐదువేల రూపాయలు తీసుకుంటున్నారు. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

వారందరిదీ సూక్ష్మ దృష్టి

పెద్ద నటులందరూ సూక్ష్మమైన విషయాలను వెంటనే పట్టుకుంటారు. వారికి అంత ఏకాగ్రత, నిబద్ధత ఉంటుంది. రజనీకాంత్‌, చిరంజీవిగారు, కమల్‌హాసన్‌, దిలీ్‌పకుమార్‌, ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌... ఇలా చెప్పుకుంటూ పోతే అగ్రనటులందరికీ సూక్ష్మ దృష్టి ఉంటుంది. ‘చూడాలని ఉంది’ సినిమా షూటింగ్‌ సమయంలో ఒక పాట చిత్రీకరిస్తున్నారు. పాట కోసం ఒక స్టేజ్‌ వేశాం. దానిపై కొన్ని కుర్చీలు ఉండాలి. కానీ అక్కడ ఉన్న కుర్చీలు వాటిపై అమరటం లేదు. దర్శకుడు గుణశేఖర్‌ వచ్చి ‘‘ఈ కుర్చీలను ఏమైనా చేయవచ్చా?’’ అని అడిగాడు. నేను వెంటనే కార్పెంటర్‌ను పిలిచి జపనీస్‌ స్టైల్‌లో కుర్చీని చేయించాను. దాన్ని స్టేజ్‌కి అమర్చాం. దానివెనుక అల్యూమినియం రేకుతో కొన్ని అక్షరాలు చెక్కించి పెట్టాం. చిరంజీవిగారు వచ్చారు. ఆయనతో పాటు కళ్యాణ్‌గారు కూడా వచ్చారు. అల్యూమినియం అక్షరాలు చిరంజీవిగారి దృష్టిలో పడ్డాయి. కళ్యాణ్‌గారితో- ‘‘చూడు. ఎంత డిటైల్డ్‌గా వెళ్లాడో చూడు... అక్షరాలు కూడా అల్యూమినియంతోనే చెక్కించాడు’’ అన్నారు. నేను మర్చిపోలేని సంఘటన అది.

రాజ్‌కపూర్‌తో...

‘సాగర సంగమం’ విజయోత్సవాలకు రాజ్‌కపూర్‌ వచ్చారు. ఆ చిత్రానికి నేను కళాదర్శకుడిని. నాన్నగారి స్నేహితుడు ఒకరు నన్ను రాజ్‌కపూర్‌ దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేశారు. ఆ సమయంలో అక్కడ పార్టీ జరుగుతోంది. మమ్మల్ని పిలవకపోయినా- నేను, కొద్దిమంది స్నేహితులం ఆ పార్టీలో దూరేసి- రాజ్‌కపూర్‌గారి సమీపంలో కూర్చున్నాం. ఆయన ఆ కబురు, ఈ కబురు చెబుతూ- ‘‘కమల్‌ డ్యాన్స్‌ చేసిన నుయ్యి నిజమైనదేనా? దాని వెనక మోటర్‌షెడ్‌ ఎందుకు పెట్టారు?’’ అని అడిగారు. ‘‘14 అడుగుల నుయ్యి తవ్వించాం. పైన రెండు ఎలక్ట్రికల్‌ పైపులు ఉన్నాయి. అందుకోసం వెనక మోటార్‌ షెడ్‌ పెట్టాం’’ అని చెప్పాను. ఈ తరం వారికి ఇలాంటి వారిని కలిసే అదృష్టం లేదనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి..

పేర్నినాని అక్కడికి వెళ్లు.. నీ రప్పా..రప్పా సంగతి వాళ్లే చూస్తారు: బోడె ప్రసాద్

అర్చక నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆనం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2025 | 04:16 AM