Forest Jamun: పర్యావరణానికి మేలు చేసే అడవి జామ
ABN, Publish Date - Aug 04 , 2025 | 03:34 AM
చాలా మందికి పర్యావరణానికి మేలు కలిగించే ఏదో ఒక పనిచేయాలని ఉంటుంది. అలాంటి వారు తమ చుట్టుపక్కల ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో అడవిజామ మొక్కను నాటితే చాలు. సీతాకోకచిలుకలు...
చాలా మందికి పర్యావరణానికి మేలు కలిగించే ఏదో ఒక పనిచేయాలని ఉంటుంది. అలాంటి వారు తమ చుట్టుపక్కల ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో అడవిజామ మొక్కను నాటితే చాలు. సీతాకోకచిలుకలు, రకరకాల పక్షులు దాని మీదకు చేరతాయి. దీని ఆకులు చిన్న చిన్న గాయాలు మాన్పటానికి ఔషధంలా కూడా ఉపయోగపడతాయి.
అడవి జామ ఆకులు పెద్దగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ ఆకులు రాలిపోయే ముందు ఎర్రగా అవుతాయి. ఈ మొక్క పువ్వులు పింక్ రంగులో పెద్దగా ఉంటాయి. సాధారణంగా వేసవిలో ఈ మొక్కకు కాయలు కాస్తాయి. ఈ కాయల్లో ఎక్కువ గింజలు ఉంటాయి. ఈ కాయలు పళ్లుగా మారిన తర్వాత వీటిలోపల ఉన్న గింజలను పక్షులు తింటాయి. కొన్నింటిని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పడేస్తాయి. వాటి నుంచి కూడా మొక్కలు వస్తాయి. ఇలా ఒక ప్రాంతంలో ఉన్న పర్యావరణ చక్రాన్ని నిరంతరం కాపాడటంలో అడవి జామ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆదివాసి ప్రాంతాల్లో ఈ చెట్టు పువ్వులతో పచ్చడి చేసుకుంటారు. ఆకులను నూరి చిన్న చిన్న గాయాలపై పూస్తే అవి వెంటనే తగ్గిపోతాయి. ఆయుర్వేద మందుల్లో కూడా అడవి జామను వాడతారు.
డాక్టర్ శ్రీనాథ్,
వృక్ష శాస్త్రవేత్త, కన్హా శాంతివనం, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్
ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్
For More AP News and Telugu News
Updated Date - Aug 04 , 2025 | 03:34 AM