Annamacharya Devotional Literature: తాళ్లపాక పద వైభవం
ABN, Publish Date - Jul 25 , 2025 | 03:16 AM
తాళ్లపాక అన్నమాచార్యుడి వంశంలో ఆయన కుమారుడు పెద తిరుమలయ్య, మనుమడు చిన తిరుమలయ్య కూడా సంకీర్తనా రచనలో ఉద్ధండులే. అందుకే ఆ ముగ్గురినీ కలిపి తాళ్లపాక పద కవిత్రయం గా...
వ్యాసపీఠం
తాళ్లపాక అన్నమాచార్యుడి వంశంలో ఆయన కుమారుడు పెద తిరుమలయ్య, మనుమడు చిన తిరుమలయ్య కూడా సంకీర్తనా రచనలో ఉద్ధండులే. అందుకే ఆ ముగ్గురినీ కలిపి ‘తాళ్లపాక పద కవిత్రయం’గా పిలుస్తూ ఉంటారు. పెద తిరుమలయ్య, చిన తిరుమలయ్య రాసిన సంకీర్తనలు సైతం అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సంకీర్తనలలోని కొన్నింటిని ఎంపిక చేసి, వాటికి వ్యాఖ్యానాన్ని జోడించి... ‘మాధవ పద ముయూఖ’ (పెద తిరుమలయ్య సంకీర్తనలు), ‘చిన్మయ చింతనం’ (చిన తిరుమలయ్య సంకీర్తనలు) అనే గ్రంథాలుగా ప్రముఖ వ్యాఖ్యాత వెంకట్ గరికపాటి వెలువరించారు. ఈ పుస్తకాలలో ఆనాటి మాండలిక పదాలకు అర్ధాలను సులభమైన సరళభాషలో రచయిత వివరించారు. తాళ్లపాక పద కవుల సంకీర్తనలను అభిమానించేవారు చదవాల్సిన పుస్తకాలివి.
మాధవ పద మయూఖ (288 పేజీలు)
చిన్మయ చింతనం (128 పేజీలు)
రచయిత: వెంకట్ గరికపాటి
ప్రతులకు: 9989092014
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 03:16 AM