How to Overcome Laziness: బద్ధకం వదలాలంటే
ABN, Publish Date - Jul 28 , 2025 | 03:48 AM
ఒక్కోసారి మనకు బద్ధకంగా ఉంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. దీనివల్ల సమయం వృథా అవుతూ ఉంటుంది. అలా కాకుండా బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం...
ఒక్కోసారి మనకు బద్ధకంగా ఉంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. దీనివల్ల సమయం వృథా అవుతూ ఉంటుంది. అలా కాకుండా బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం...
ఎప్పుడు చేయాలనుకున్న పనిని అప్పుడే పూర్తిచేస్తూ ఉంటే బద్ధకంగా అనిపించదు. పనులను వాయిదావేయడం మానుకోవాలి.
ఏ పనిచేస్తే ఏమవుతుందో అన్న భయం కూడా మంచిది కాదు. దీనివల్ల తెలియకుండానే పనులను వాయిదా వేస్తూ ఉంటారు. భయాందోళనలకు గురికాకుండా పనులు చేస్తూ ఉంటే బద్ధకం దరిచేరదు.
నిర్ధేశించుకున్న లక్ష్యాలను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉండాలి. దీంతో ఆ లక్ష్య సాధన కోసం త్వరగా పని పూర్తిచేయాలన్న ఆలోచన వస్తుంది. శరీరం చురుకుగా పనిచేస్తుంది.
రోజూ ఒకే దినచర్యను పాటించాలి. సమయానుసారం నిద్రించడం, ఉదయాన్నే వ్యాయామం చేయడం, అల్పాహారం తీసుకోవడం లాంటివి బద్ధకాన్ని వదిలిస్తాయి.
శరీరం అలసిపోయినా కూడా బద్ధకంగా అనిపిస్తుంది. కాబట్టి శ్రమ అనిపించినప్పుడు కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం కూడా ఉపకరిస్తుంది.
పూర్తి చేయాలనుకున్న పనులను ఒక లిస్టుగా రాసుకోవాలి. తరచూ ఈ లిస్టును చూస్తూ ఒకదాని తరవాత మరోదాన్ని పూర్తిచేస్తూ ఉండాలి.
పెద్ద పనులు అనుకోకుండా త్వరగా పూర్తయినప్పుడు ఆ ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. అప్పుడే బద్ధకం వదిలి మరింత ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..
ఈ ఒక్క జ్యూస్‌తో గుండె జబ్బులన్నీ మాయం..
Updated Date - Jul 28 , 2025 | 03:48 AM