ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shilpa Shirodkar: సినిమా కోసం నన్ను చంపేశారు

ABN, Publish Date - Jul 27 , 2025 | 03:42 AM

శిల్పా శిరోద్కర్‌... ఈ పేరు జ్ఞాపకం వచ్చిందా? ఒకప్పటి బాలీవుడ్‌ హీరోయిన్‌గా కన్నా.. హీరో మహేష్‌ బాబు భార్య నమ్రతకు చెల్లెలుగానే తెలుగువారికి ఎక్కువగా తెలుసు. తెలుగులో మోహన్‌బాబుతో ‘బ్రహ్మా’ సినిమాలో కూడా...

శిల్పా శిరోద్కర్‌... ఈ పేరు జ్ఞాపకం వచ్చిందా? ఒకప్పటి బాలీవుడ్‌ హీరోయిన్‌గా కన్నా.. హీరో మహేష్‌ బాబు భార్య నమ్రతకు చెల్లెలుగానే తెలుగువారికి ఎక్కువగా తెలుసు. తెలుగులో మోహన్‌బాబుతో ‘బ్రహ్మా’ సినిమాలో కూడా నటించారు సుమారు రెండు దశాబ్దాల క్రితం వివాహం చేసుకొని విదేశాలకు వెళ్లిన శిల్ప... మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చేశారు. ‘బిగ్‌ బాస్‌ హిందీ- సీజన్‌ 18’లో పాల్గొన్నారు. ఇప్పటివరకు మీడియాకు దూరంగా ఉన్న శిల్ప ఇటీవల ఒక ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో తన జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు.

ఎంతో తేడా...

‘‘నేను 10వ తరగతి ఫెయిల్‌ అయ్యా. నా భర్త అపరేష్‌ రంజిత్‌ డబుల్‌ ఎంబీఏ. అయితే మా మధ్య చదువు విషయం ఏ రోజూ చర్చకు రాలేదు. ఆయన నన్ను ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. ఆయన నా వృత్తిని గౌరవిస్తారు. నేను ఆయన వృత్తిని గౌరవిస్తా. మా తల్లిదండ్రులు చనిపోయాక నా జీవితంలో ఒక శూన్యం ఏర్పడింది. ఏదో వెలితిగా ఉండేది. భారత్‌కు వచ్చేయాలని బలంగా అనిపించింది. నేను వచ్చేద్దామనుకొనే సమయానికి రంజిత్‌ కెరీర్‌ చాలా బావుంది. తను దాన్ని వదులుకొని రాలేని పరిస్థితి ఉంది. కానీ ఆయన నన్ను అర్ధం చేసుకొన్నారు. నేను కొన్నేళ్లు నా సోదరి నమ్రత దగ్గర ఉంటే మానసికంగా బావుంటుందను కున్నాం. నేను భారత్‌ వచ్చేశా. వచ్చిన తర్వాత ‘బిగ్‌ బాస్‌ హిందీ- సీజన్‌ 18’లో పాల్గొన్నా. ఈ సమయంలోనే నేను మినిమలిస్టిక్‌ లైఫ్‌ స్టైల్‌ను (పూర్తి నిడారంబరమైన జీవన విధానాన్ని) అనుసరించటం ప్రారంభించా. ఇంట్లో కూడా అతి తక్కువ వస్తువులు ఉండేవి. ఇంట్లోనే కాదు... వంటింట్లో కూడా అత్యవసర మైన మూడు పదార్థాలే ఉంచేదాన్ని. ఒకసారి రంజిత్‌ ముంబాయిలోని మా ఇంటికి వచ్చారు. నేను ఆ సమయంలో వేరే చోట ఉన్నా. ఆయనకు ఎందుకో సరదాగా వంట చేయాలని అనిపించింది. వంటింట్లోకి వెళ్లి చూశారు. గరం మసాలాతో సహా వంటకు అవసరమైన పదార్థాలేవీ లేవు. నాకు ఫోన్‌ చేసి... ‘‘ఇంట్లో ఏవీ లేవు. గరం మసాలా కూడా లేదు’’ అన్నారు. ‘‘నేను ఈ మధ్య వేటినీ వాడటం లేదు’’ అని సమాధానమిచ్చా. ఆయన ‘‘నీకు పిచ్చి పట్టింది’’ అన్నారు.

తమాషా సంఘటనలు అనేకం

నా వృత్తి జీవితంలో అనేక తమాషా సంఘటనలు ఉన్నాయి. 1995లో ‘రఘువీర్‌’ అనే సినిమా చేశాను. ఆ సినిమా షూటింగ్‌ కోసం కులుమనాలీ వెళ్లాం. ఈ లోపులో ముంబాయిలోని ఒక పత్రికలో నేను చనిపోయానని వార్త వచ్చిందిట. నేను ఆ వార్త చదవలేదు. నేను చనిపోయాననే వార్త చదివిన వారు... లోకేషన్‌లో నన్ను చూసి కంగారు పడ్డారు. నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ వార్తను ముంబాయిలో అమ్మానాన్న చదివి చాలా ఆందోళన చెందారు. షూటింగ్‌ నుంచి హోటల్‌కు వెళ్లేసరికి వారి నుంచి 25 మిస్డ్‌ కాల్స్‌ ఉన్నాయి. అప్పుడు వాళ్లకు ఫోన్‌ చేసి... నేను క్షేమంగానే ఉన్నానని చెప్పా ను. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలి. ఈ పుకారును వ్యాప్తి చేసింది... నేను నటిస్తున్న సినిమా నిర్మాత గుల్షన్‌ కుమారే! సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తించటం కోసం ఈ పుకారు పుట్టించారు.’’

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 03:42 AM