Tooth Regrowth: మళ్లీ మళ్లీ పెరిగే దంతాలు
ABN, Publish Date - Sep 09 , 2025 | 05:17 AM
పాల దంతాలు ఊడిపోయి, వాటి స్థానంలో శాశ్వత దంతాలొస్తాయి. ఈ రెండో దంతాలు ఊడిపోతే కట్టుడు...
పాల దంతాలు ఊడిపోయి, వాటి స్థానంలో శాశ్వత దంతాలొస్తాయి. ఈ రెండో దంతాలు ఊడిపోతే కట్టుడు దంతాలు మినహా మరే మార్గమూ ఉండదు. కానీ తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు మూడోసారి దంతాలు పెరిగే ఒక ఔషధాన్ని సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. ఆసక్తికరమైన ఈ అంశం గురించి తెలుసుకుందాం!రెండోసారి ఊడిపోయిన శాశ్వత దంతాల స్థానంలో, చిగుళ్ల నుంచి మూడో దంతాల సెట్ పెరగడం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. కిటానో ఆస్పత్రి మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ కట్సు టకహాషి నాయకత్వంలోని పరిశోధకుల బృందం, దంతాల పెరుగుదలకు అవరోధంగా మారుతున్న యుఎ్‌సఎజి-1 అనే జన్యు ప్రొటీన్‌ను అడ్డుకునే ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఎలుకల మీద చేపట్టిన ప్రయోగాల్లో, ఈ ప్రొటీన్‌ను అణచివేయడం ద్వారా, కొత్త దంతాల పెరుగుదల విజయవంతంగా ఊపందుకోవడాన్ని పరిశోధకులు కనిపెట్టారు. 2013 నాటికి ఈ చికిత్సను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, మనుషుల మీద కూడా ఈ ప్రయోగాలను చేపట్టడానికి పరిశోధకులు సిద్ధపడుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఎన్నో కోట్ల మందికి మూడవ దంతాల సెట్ ప్రయోజనం దక్కుతుంది. దశాబ్దాల పునరుత్పాదక పరిశోధన ఆధారంగా నిర్మితమైన సైన్స్... షార్కులు, ఏనుగుల మాదిరిగానే మనుషులు కూడా సహజసిద్ధంగా పెరిగే బహుళ దంతాల సెట్‌ను కలిగి ఉంటారని పరిశోధకులు నమ్ముతున్నారు. డెంటల్ పల్ప్, ఎముకల పునరుత్పాదకతలో కొనసాగుతున్న అభివృద్ధి ఆధారంగా... జన్యుపరమైన కారణాల రీత్యా, ప్రమాదాల్లో, లేదా వార్థక్యంతో కోల్పోయిన దంతాలను తిరిగి మొలిపించుకునే వీలు కలుగుతుందని పరిశోధకులు అంటున్నారు.
Updated Date - Sep 09 , 2025 | 05:17 AM