ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Environmental Toxins: కాలుష్యంతో క్యాన్సర్‌

ABN, Publish Date - Aug 05 , 2025 | 03:32 AM

ధూమపానానికీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కూ దగ్గరి సంబంధం ఉందని మనందరికీ తెలుసు. అయుతే ఆ అలవాటు లేనివాళ్లకు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకుతున్న సంఘటనలు తాజాగా వెలుగులోకొస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే...

అప్రమత్తం

ధూమపానానికీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కూ దగ్గరి సంబంధం ఉందని మనందరికీ తెలుసు. అయుతే ఆ అలవాటు లేనివాళ్లకు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకుతున్న సంఘటనలు తాజాగా వెలుగులోకొస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే...

బెంగుళూరుకు చెందిన మారథాన్‌ ఔత్సాహికవేత్త, ఐటి ఉద్యోగి, 34 ఏళ్ల ప్రియకు ధూమపానం అలవాటు లేదు. క్రమం తప్పక వ్యాయాం చేస్తుంది. అలా అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న ప్రియను దగ్గు, అలసట వేధించడం మొదలుపెట్టాయి. మొదట్లో వాతావరణ మార్పుల ప్రభావమని సరిపెట్టుకున్న ప్రియ, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వైద్యులను కలిసింది. ఎక్స్‌రే, సిటి స్కాన్‌లో ఆమె కుడి ఊపిరితిత్తిలో కనిపించిన కణితి, మూడో దశ నాన్‌ స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌గా నిర్థారణ అయింది. హర్యాణా, పానిపట్‌కు చెందిన 43 ఏళ్ల పూనమ్‌ శర్మ, స్కూల్‌ టీచర్‌. దగ్గుతో పాటు రక్తం పడుతూ ఉండడంతో వైద్యులను కలిసిందామె. పరీక్షల్లో ఆమెకు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకినట్టు నిర్థారణ అయింది. ధూమపానం ఎరుగని పూనమ్‌, ప్రియలు ఇద్దరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడంతో పాటు ఇంటి భోజనానికే పరిమితమయ్యే మహిళలు. అయినప్పటికీ వీళ్లిద్దరికీ లంగ్‌ క్యాన్సర్‌ సోకింది. నిజానికి ఇలాంటి సందర్భాలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ధూమపానం ఎరుగని మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ 15 నుంచి 20 శాతం పెరిగినట్టు ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.

కాలుష్యమే కారణం

పట్టణ వాయు కాలుష్యంలో వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే సూక్ష్మ అణువులు, క్యాన్సర్‌ కారకాలను కలిగి ఉంటాయి. అతి సూక్ష్మ శ్వాస నాళికల్లోకి చేరుకునే ఈ క్యాన్సర్‌ కారకాలు క్రమేపీ ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బయోమాస్‌ ఫ్యూయల్‌ స్మోక్‌, గృహ రసాయనాలు, రాడాన్‌ లేదా పొగాకు లాంటి కలుషితాలు కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తాయని బెంగుళూరులోని గ్లెనిగేల్స్‌ హాస్పిటల్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, డాక్టర్‌ రాజీవ్‌ విజయకుమార్‌ అంటున్నారు. ఇళ్లలో వంటకు ఉపయోగించే సంప్రదాయ ఇంధనం గత దశాబ్దకాలంలో ఎన్నో మార్పులకు లోనైందనీ, ఇది కూడా క్యాన్సర్‌ పెరుగుదలకు దోహదపడిందనీ, దీర్ఘకాలిక పర్యావరణ కాలుష్యం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రేరేపిస్తోందనీ అంటున్నారాయన. అయితే కొందరు మహిళల్లో జన్యు ఉత్పరివర్తన వల్ల కణ పెరుగుదల నియంత్రణ కోల్పోతుందనీ, ఈ పరిస్థితి ధూమపానం అలవాటు లేని ఆసియా వాసుల్లో కనిపిస్తూ ఉంటుందనీ ఈ మార్పు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీస్తోందనీ ఇంకొందరు వైద్యులు అంటున్నారు.

ఎలాంటి చికిత్స?

ధూమపానంతో సంబంధం లేని ఊపిరితిత్తుల క్యాన్సర్‌, టార్గెటెడ్‌ థెరపీకి భిన్నంగా, మెరుగ్గా స్పందిస్తుంది. క్యాన్సర్‌ పెరుగుదలను ప్రేరేపించే ఉత్పరివర్తన ప్రొటీన్‌ ప్రభావాన్ని అడ్డుకునే నోటి మాత్రలు మెరుగైన ఫలితాన్ని అందిస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. సంప్రదాయ కీమోథెరపీకి భిన్నమైన టార్గెటెడ్‌ చికిత్స, తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉండడమే కాకుండా, అంతకు మించిన ప్రభావాన్ని కనబరుస్తుందని కూడా వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తించి, చికిత్స మొదలుపెడితే ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది కాబట్టి ఎంతకూ తగ్గని దగ్గు, ఛాతీ బిగదీయడం, వెన్ను నొప్పి, శ్వాసలో ఇబ్బంది, అకారణంగా బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 03:32 AM