ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఊబకాయం చికిత్సతో క్యాన్సర్లు దూరం

ABN, Publish Date - Jun 10 , 2025 | 05:58 AM

ఊబకాయం చికిత్సతో ఊబకాయ సంబంధిత క్యాన్సర్ల ప్రమాదం దాదాపు 50 శాతం తగ్గుతుందని ఇజ్రాయెల్‌ పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో భాగంగా సుమారు...

అధ్యయనం

ఊబకాయం చికిత్సతో పలు రకాల క్యాన్సర్ల ప్రమాదం దాదాపు సగం తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఆ వివరాలు...

ఊబకాయం చికిత్సతో ఊబకాయ సంబంధిత క్యాన్సర్ల ప్రమాదం దాదాపు 50 శాతం తగ్గుతుందని ఇజ్రాయెల్‌ పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో భాగంగా సుమారు 6 వేల మందిని పరిశీలించారు. ఊబకాయం చిక్సితకు వాడే ఇంజక్షన్లు, బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స వలన, 13 రకాల ఊబకాయ సంబంధిత క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందని కనుగొన్నారు.

ది లాన్సెట్‌ క్లినికల్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం వివరాలను స్పెయిన్‌లో జరిగిన యూరోపిన్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఒబిసిటీ సమావేశంలో పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా బరువు తగ్గడం వలన ఆ క్యాన్సర్ల ప్రమాదం కొంతమేర తగ్గుతుంది. అయితే చికిత్సకు వాడే ఇంజెక్షన్ల వలన ఆ ప్రమాదం మరింత తగ్గుతుందని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఊబకాయానికి మందులు, ఇంజెక్షన్‌లు వాడే వారికంటే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకునే వారు రెండింతల బరువు తగ్గుతారు. బేరియాట్రిక్‌ సర్జరీ వలన 30 నుంచి 42 శాతం వరకు ఈ క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.

అలాగే బరువును తగ్గించే మందులు, ఇంజక్షన్లు ఈ క్యాన్సర్ల ప్రమాదాన్ని దాదాపు 50 శాతం తగ్గించగలవని కనుగొన్నారు. అయితే ఈ మందులు ఊబకాయం సంబంధం లేని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచబోవని నిర్ధారించుకోవడం కోసం మరిన్ని పరిశోధనలు అవసరమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 05:58 AM