ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Neck wrinkles Removal: మెడపై గీతలు వస్తున్నాయా

ABN, Publish Date - May 12 , 2025 | 05:19 AM

మెడపై గీతలు వాతావరణ మార్పులు, జీవనశైలి వల్ల ఏర్పడతాయి. సరైన ఆహారం, హైడ్రేషన్, మాయిశ్చరైజింగ్‌, వ్యాయామం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు.

వాతావరణంలో మార్పులు, జీవన విధానాల వల్ల మెడ మీద సన్నని గీతలు ఏర్పడుతూ ఉంటాయి. వీటివల్ల మెడ అందం పాడవుతూ ఉంటుంది. చిన్న చిట్కాలతో ఈ గీతలను పోగొట్టి మెడను ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు...

  • ప్రతిరోజూ కనీసం అయిదు గ్లాసుల నీళ్లు తాగాలి. నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అప్పుడే చర్మానికి తేమ అందడంతోపాటు చర్మం మృదువుగా మెరుస్తుంది. సాగే గుణం పెరుగుతుంది. దీనివల్ల చర్మం మీద గీతలు ఏర్పడకుండా ఉంటాయి.

  • బయటికి వెళ్లడానికి అరగంట ముందు మెడకు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవాలి. దీనివల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ ఏర్పడి మెడ మీద గీతలు రావు.

  • మొబైల్‌, ల్యాప్‌టాప్‌ వినియోగించేటప్పుడు మెడను ముందుకు చాచడం వల్ల కూడా గీతలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సరైన భంగిమలో కూర్చోవాలి. తరచూ భుజాలను, మెడను అటూ ఇటూ తిప్పడం వల్ల అక్కడి కండరాలు బలోపేతమవుతాయి. రక్తప్రసరణ సజావుగా జరిగి గీతలు, ముడతలు మాయమవుతాయి.

  • ఆకు కూరలు, గింజలు, చేపలను తరచూ తింటూ ఉండాలి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవాలి. వీటివల్ల చర్మానికి పోషణ లభిస్తుంది.

  • మెడమీద మురికి చేరకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి సున్నిపిండితో రుద్ది శుభ్రం చేసుకోవాలి. తరచూ మాయిశ్చరైజర్‌ రాసుకుంటూ ఉండాలి. విటమిన్‌-ఇ ఆయిల్‌ రాసుకున్నా ప్రయోజనం ఉంటుంది.

  • నిద్ర సరిపోకపోతే చర్మం మీద ముడతలు, గీతలు ఏర్పడతాయి. అందుకే ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి.

Updated Date - May 12 , 2025 | 05:21 AM