ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Alcohol Withdrawal Aid: మద్యం మాన్పించే నేసల్‌ స్ప్రే

ABN, Publish Date - Jul 29 , 2025 | 05:21 AM

మద్యం మీదకు మనసును మళ్లించే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ను ప్రభావితం చేయడం ద్వారా ఆ అలవాటును మాన్పించే దిశగా పరిశోధకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళ్తే....

అధ్యయనం

మద్యం మీదకు మనసును మళ్లించే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ను ప్రభావితం చేయడం ద్వారా ఆ అలవాటును మాన్పించే దిశగా పరిశోధకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళ్తే....

లవ్‌ హార్మోన్‌గా పేర్కొనే ఆక్సిటోసిన్‌ సహాయంతో వ్యసనానికి ప్రతికూలంగా స్పందించేలా మెదడులో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలకు పరిశోధకులు పూనుకున్నారు. నేసల్‌ స్ర్పే ద్వారా ఆక్సిటోసిన్‌ను విడుదల చేసినప్పుడు, మద్యానికి అలవాటు పడిన ఎలుకల మెదళ్లలోని రివార్డ్‌ సెంటర్స్‌ స్పందన తీవ్రత తగ్గినట్టు పరిశోధనలో తేలింది. అలాగే అత్యధిక క్యాలరీలు కలిగి ఉన్న ఆహారాన్ని తినడం ద్వారా కొందర్లో ఈ రివార్డు సెంటర్లు విపరీతంగా స్పందిస్తూ, సదరు వ్యక్తులను ఆహార వ్యసనపరులుగా మారుస్తూ ఉంటాయి. ఆక్సిటోసిన్‌ నేసల్‌ స్ర్పేను ఉపయోగించినప్పుడు, ఈ హార్మోన్‌ ఆకలితో సంబంధమున్న మెదడులోని ప్రదేశాన్ని ప్రేరేపించి, కడుపు నిండిపోయిన భావనకు లోను చేస్తుందనీ, ఫలితంగా అదనపు క్యాలరీల సమస్య కూడా తప్పుతుందని కూడా పరిశోధకులు అంటున్నారు. ఈ ప్రభావాలతో పాటు, శరీరం కొవ్వును ఖర్చు చేసుకునే వేగం, ఇన్సులిన్‌ సున్నితత్వం, గ్లూకోజ్‌ వినియోగం మొదలైన బరువుతో సంబంధమున్న అంశాలపరంగా కూడా ఆక్సిటోన్‌ ప్రభావాన్ని కనబరుస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. భద్రత, ప్రభావాలపరంగా ఈ నేసల్‌ స్ర్పే ప్రయోగాలు సఫలీకృతమైతే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది మద్యపాన వ్యసనపరులు ఈ దురలవాటు ఉంచి విముక్తి పొందగలుగుతారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నాగ పంచమి... జస్ట్ ఇలా చేయండి..

‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 29 , 2025 | 05:21 AM