Hobbies for Personal Growth: అభిరుచులకూ ఇవ్వాలి సమయం
ABN, Publish Date - Jul 31 , 2025 | 01:16 AM
మనందరికీ పుస్తక పఠనం, సంగీతం, రచనా వ్యాసాంగం, ఆటలు... ఇలా ఏదో ఒక అభిరుచి ఉండే ఉంటుంది. కానీ సమయాభావం అంటూ వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలాకాకుండా రోజూ కొన్ని చిట్కాలు పాటించి...
మనందరికీ పుస్తక పఠనం, సంగీతం, రచనా వ్యాసాంగం, ఆటలు... ఇలా ఏదో ఒక అభిరుచి ఉండే ఉంటుంది. కానీ సమయాభావం అంటూ వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలాకాకుండా రోజూ కొన్ని చిట్కాలు పాటించి కొంత సమయాన్ని అభిరుచులకోసం కేటాయించుకోవచ్చు.
ముందుగా అవసరం లేని పనులు చేయకూడదు. ఉదాహరణకు ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడడం, తరచూ షాంపింగ్ కోసమని వెళ్లడం, ఎక్కువగా టీవీ చూడడం లాంటివి. దీనివల్ల రోజూ కొంత సమయం మిగులుతుంది.
బొమ్మలు గీయడం, నృత్యం చేయడం, సంగీత పరికరాలు వాయించడం ఇలా ఆసక్తి ఉన్న అంశం మీద రోజూ అరగంట సాధన చేయాలి. అవసరమైతే శిక్షణ కూడా తీసుకోవచ్చు. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా ఒకప్పుడు అనుకున్న లక్ష్యం సాధించవచ్చు.
రోజూ చేయాల్సిన పనులను పక్కన పెట్టడం, వాయిదా వేయడం లాంటివి చేయకూడదు. దీనివల్ల వాటికి సంబంధించిన ఆలోచనలతో ఏకాగ్రత కుదరదు. సమయానుసారం పనులు పూర్తిచేసిన తరవాత మాత్రమే మీకిష్టమైన అంశాలమీద దృష్టి నిలపాలి.
ఒకేసారి గంటల సమయం కాకుండా పావుగంటతో మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని పెంచుకోవాలి. వారాంతాల్లో కనీసం రెండు గంటలు అభిరుచులకోసం కేటాయించుకోవాలి.
అన్ని పనులనూ ఒక్కరమే చేయాలన్న భావనతో ఉండకుండా కుటుంబసభ్యుల సహాయం తీసుకుంటూ ఉండాలి. అప్పుడే రోజూ కొంత సమయం దొరుకుతుంది.
ఏ పనికి ఎంత సమయం పెట్టాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. అత్యవసరమైనవాటిని త్వరగా పూర్తిచేయాలి. సమయం వృథాకాకుండా చూసుకోవాలి. అప్పుడే అభిరుచులకూ సమయం దొరుకుతుంది.
ఇవి కూడా చదవండి
రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..
అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
Updated Date - Jul 31 , 2025 | 01:16 AM