Artificial Womb: గర్భం వెలుపల పిండం
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:54 AM
నెలలు నిండకముందే పుట్టిన పిల్లల ప్రాణాలను కాపాడేందుకు జపాన్ శాస్త్రవేత్తలు కృత్రిమ గర్భాశయాన్ని అభివృద్ధి చేశారు. పిండాన్ని శరీరం వెలుపల పెంచేందుకు, అకాల జనన సమయంలో చికిత్సలందించేందుకు ఇది ఉపయోగపడుతుందంటున్నారు.
శరీరం వెలుపల పిండాన్ని పెంచే వీలుండే కృత్రిమ గర్భాశయాన్ని జపాన్ అభివృద్ధి చేసింది. జపాన్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు నెలలు నిండకుండా పుట్టిన, జబ్బుపడిన పిండాలకు చికిత్సలందించి, ప్రాణాలను కాపాడడం కోసం, ఎక్స్ వివో యుటెరిన్ ఎన్విరాన్‌మెంట్ థెరపీ ప్రధానంగా ఈ ఆవిష్కరణకు పూనుకుంది. ఈ కృత్రిమ గర్భాశయం, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో తలెత్తే సమస్యలను అడ్డుకునే నియంత్రిత పర్యావరణాన్ని కలిగి ఉండడం విశేషం. అయితే మానవ శరీరం వెలుపల తొమ్మిది నెలల పిండాన్ని పెంచడం ఈ సాంకేతిక ఆవిష్కరణ ఉద్దేశం కాదనీ, కేవలం నెలలు నిండకుండా పుట్టిన పిల్లల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధాన ఉద్దేశమని ఈ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 03 , 2025 | 04:54 AM