ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెవిలో పురుగు దూరితే..!

ABN, Publish Date - Apr 19 , 2025 | 04:47 AM

ఒక్కోసారి చెవిలోకి చీమలు, బొద్దింకలు లాంటి చిన్న చిన్న పురుగులు దూరి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. లోపలికి వెళ్లినంత సులువుగా అవి బయటికి రావు. వీటిని బయటికి రప్పించడానికి నిపుణులు చెబుతున్న...

పర్సనల్‌ కేర్‌

ఒక్కోసారి చెవిలోకి చీమలు, బొద్దింకలు లాంటి చిన్న చిన్న పురుగులు దూరి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. లోపలికి వెళ్లినంత సులువుగా అవి బయటికి రావు. వీటిని బయటికి రప్పించడానికి నిపుణులు చెబుతున్న చిట్కాలివి...

  • చెవిలోకి ఏదైనా పురుగు ప్రవేశిస్తే వెంటనే చీకటి గదిలోకి వెళ్లి టార్చ్‌ లేదా మొబైల్‌ లైట్‌ను చెవిలో చూపించాలి. వెలుగును చూసిన వెంటనే కొన్ని రకాల పురుగులు బయటికి వచ్చేస్తాయి.

  • చెవిలో ఆలివ్‌ నూనె లేదంటే బేబీ ఆయిల్‌ చుక్కలు వేస్తే ఆ నూనెతోపాటే పురుగు బయటికి వస్తుంది.

  • గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీటిని చుక్కలుగా చెవిలో వేస్తే లోపలికి వెళ్లిన పురుగు బయటికి వచ్చేస్తుంది.

  • ఆల్కహాల్‌లో చిన్న దూది వుండను ముంచి దాన్ని చెవి రంధ్రం దగ్గర పెడితే ఆ ఘాటుకి పురుగు బయటికి వచ్చేస్తుంది. ఆలా రాని పక్షంలో ఒక చుక్క ఆల్కహాల్‌ని వేలితో తీసుకుని చెవిలోపల రాస్తే ఫలితం కనిపిస్తుంది.

  • చెవిలోకి పురుగు దూరినప్పుడు బడ్స్‌, పిన్నీసు, అగ్గిపుల్ల, సూది లాంటి వాటితో దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయకూడదు. ఇలా చేస్తే చెవి నొప్పి పెరుగుతుంది.

  • ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పురుగు బయటికి రాకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాలి.

ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 19 , 2025 | 04:47 AM