ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నల్లటి వలయాలు ఇలా మాయం

ABN, Publish Date - Jun 05 , 2025 | 05:58 AM

నిద్రలేమి, కంప్యూటర్లు, ఫోన్లు ఎక్కువ సేపు చూడడం, ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, మారిన జీవన విధానం వంటి కారణాలతో కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి...

నిద్రలేమి, కంప్యూటర్లు, ఫోన్లు ఎక్కువ సేపు చూడడం, ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, మారిన జీవన విధానం వంటి కారణాలతో కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. వీటిని ఎలా తగ్గించుకోవచ్చంటే...

  • చెంచా టమాటా రసంలో కొంచెం నిమ్మరసం కలిపి కళ్ల కింద రాయాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.

  • బంగాళాదుంప రసంలో దూది ముంచి నల్లటి వలయాల మీద పెట్టి పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. లేదా బంగాళాదుంప ముక్కను కళ్ల కింద 10 నిమిషాల పాటు రుద్ది నీటితో కడగవచ్చు.

  • గ్రీన్‌ టీ సంచులను నీటిలో ముంచి తీసి కొంచెం సేపు ఫ్రిడ్జిలో ఉంచాలి. వాటిని 10 నిమిషాల పాటు కళ్ల మీద పెట్టాలి.

  • రాత్రి బాదం నూనెను కళ్ల కింద రాసి మసాజ్‌ చేసి, ఉదయాన్నే నీటితో కడిగేయాలి.

  • కలబంద గుజ్జును రాత్రి కళ్ల కింద రాసి కొంచెం సేపు సున్నితంగా మర్దన చేసి ఉదయాన్నే కడిగేయాలి.

  • నారింజ రసంలో కొంచెం గ్లిజరిన్‌ కలిపి కళ్ల కింద రాయాలి. దీని వల్ల నల్ల వలయాలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది.


  • కీరదోసను గుండ్రటి ముక్కలు చేసి వాటిని కళ్లపై ఉంచాలి.

  • పుదీనా ఆకులను పేస్టు చేసి కళ్ల కింద రాసి ఓ పది నిమిషాలు ఆగి కడిగాలి. రోజు రాత్రి ఇలా చేస్తే నల్లటి వలయాలు తగ్గుతాయి.

  • గులాబీ నీళ్లలో దూదిని ముంచి నల్లటి వలయాలపై ఉంచాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడగాలి.

  • మజ్జిగలో పసుపు కలిపి పేస్టులా చేసి దానిని కళ్ల కింద రాయాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో కడగేసుకోవాలి.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 05:58 AM