Re pot Your Plants: కుండీ మారుస్తున్నారా
ABN, Publish Date - Jul 10 , 2025 | 02:20 AM
మనలో చాలామంది కుండీల్లో మొక్కలు పెంచుతూ ఉంటారు. అకస్మాత్తుగా కుండీ పగిలినా, మొక్క పెరుగుదల ఆగిపోయిందనిపించినా కొత్త కుండీని తీసుకొస్తూ...
మనలో చాలామంది కుండీల్లో మొక్కలు పెంచుతూ ఉంటారు. అకస్మాత్తుగా కుండీ పగిలినా, మొక్క పెరుగుదల ఆగిపోయిందనిపించినా కొత్త కుండీని తీసుకొస్తూ ఉంటారు. ఇలా కుండీని మార్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఉన్నదాని కంటే పెద్ద కుండీని తేవడం మంచిది కాదు. అలా తెచ్చినట్లయితే మొక్కను నాటిన తరవాత నీళ్లు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలవాటు ప్రకారం కుండీ నిండా నీళ్లు పోస్తే మొక్క సజావుగా ఎదగలేదు. కాబట్టి మరీ పెద్దది కాకుండా కొద్దిగా వెడల్పాటి కుండీని తెచ్చుకుంటే ఏ సమస్యా ఉండదు.
కుండీని తెచ్చిన వెంటనే అడుగు భాగంలో రంధ్రం చేయాలి. లేదంటే నీళ్లు నిలిచి మొక్క వేర్లు కుళ్లిపోతాయి. కుండీలో పూర్తిగా కొత్త మట్టిని నింపకూడదు. కొద్దిగా పాత మట్టితోపాటు ఇప్పటివరకు మొక్క ఎదుగుదల కోసం అందిస్తున్న ఎరువులను కూడా కలిపి నింపాలి.
కొన్ని మొక్కలకు రోజంతా..... మట్టి తేమగా ఉండాలి. కొన్ని మాత్రం పొడి మట్టిలోనే ఏపుగా పెరుగుతాయి. మొక్క అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అలాంటి గుణాలు ఉన్న మట్టిని తెచ్చుకోవాలి.
కొత్త కుండీలో నాటేటప్పుడు మొక్క వేర్లను పూర్తిగా తీసుకోవాలి. వాటిలో కొంతభాగాన్ని మాత్రమే తీసుకుంటే మొక్క ఎండిపోతుంది. వేర్లలో కుళ్లిన భాగాలను తీసివేయాలి. వేర్లు గుబురుగా చిక్కులుగా ఉంటే వాటిని జాగ్రత్తగా విడదీసి మట్టిలో కూర్చాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది.
మొక్కను నాటిన వెంటనే ఎక్కువగా నీళ్లు పోయకూడదు. మొదటి రెండు రోజులు మట్టి తడిసేలా కొద్దిగా నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది.
కుండీ పగిలిన సందర్భంలో తప్ప మొక్కలను ఎప్పుడంటే అప్పుడు కొత్తదానిలోకి మార్చకూడదు. స్వభావ రీత్యా మొక్కలు చిగుర్లు వేసే కాలంలో మారిస్తే చక్కగా నాటుకుని గుబురుగా పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 10 , 2025 | 02:34 AM