ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షాల్లో పసికందుల సమస్యలు

ABN, Publish Date - Jul 03 , 2025 | 03:06 AM

ఎక్కువ తేమతో కూడిన చల్లని వానాకాలం వాతావరణంలో పసికందుల చర్మం మీద సూక్ష్మజీవులు విస్తృతంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. పసికందుల శరీరాల్లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే వ్యవస్థ...

కౌన్సెలింగ్‌

వానాకాలంలో పసికందులకు చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

ఓ సోదరి, హైదరాబాద్‌

ఎక్కువ తేమతో కూడిన చల్లని వానాకాలం వాతావరణంలో పసికందుల చర్మం మీద సూక్ష్మజీవులు విస్తృతంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. పసికందుల శరీరాల్లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పులను పసి చర్మాలు తట్టుకోలేవు. కాబట్టి ఈ కాలంలో ఈ కింది జాగ్రత్తలు పాటించాలి.

  • పసిపిల్లలకు తేలికైన కాటన్‌ దుస్తులు వేయాలి. పొడవాటి చేతుల దుస్తులు వేస్తే, దోమ కాటు నుంచి కూడా రక్షణ దొరుకుతుంది.

  • ప్రతి రెండు గంటలకోసారి డయాపర్‌ మారుస్తూ ఉండాలి. లేదంటే తడిచిన వెంటనే మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే కటి ప్రాంతంలో తేమను నియంత్రించగలుగుతాం. అలాగే రోజులో 2 నుంచి 4 గంటల పాటు డయాపర్‌ లేకుండా పిల్లలను వదిలేయాలి.

  • పసి పిల్లలకు కల్తీ లేని తాజా కొబ్బరినూనె పట్టించి, మర్దన చేయాలి. పసికందుల చర్మం లోపలి పొరల్లోకి ఈ నూనె తేలికగా ఇంకిపోతుంది.

  • వానాకాలం వాతావరణం మూలంగా పిల్లల రోగనిరోధకశక్తి బలహీనంగా ఉంటుంది కాబట్టి ఇన్‌ఫెక్షన్లు తేలికగా సోకుతూ ఉంటాయి. కాబట్టి మురికితో కూడిన పరిసరాలకు, ఇన్‌ఫెక్షన్లు సోకిన వారికి పసికందులను దూరంగా ఉంచాలి.

  • దోమల మందులకు బదులుగా దోమ తెరలు వాడుకోవాలి.

ఆరోగ్యమైన చర్మం కోసం

ఫ ప్రతి రోజూ స్నానం చేయిస్తూ, చర్మాన్ని శుభ్రంగా ఉంచాలి. స్నానం కోసం సున్నితమైన క్లీన్సర్‌, గోరువెచ్చని నీళ్లు వాడాలి.

ఫ స్నానం చేయించిన వెంటనే, చర్మాన్ని రుద్దకుండా, పొడిగా తుడవాలి.

ఫ స్నానం తర్వాత కొబ్బరి నూనె పూయడం వల్ల, పిల్లల చర్మం తేమను సంతరించుకుని, దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

ఫ రాత్రి నిద్రకు ముందు పసికందుల కోసం ఉద్దేశించిన బాడీ లోషన్‌ అప్లై చేయాలి.

ఫ డయాపర్‌ మార్చే ప్రతిసారీ ఆ ప్రదేశాన్ని కాటన్‌

క్లాత్‌తో పొడిగా తుడిచి, వర్జిన్‌ కొకొనట్‌ ఆయిల్‌ పూయాలి. మలమూత్రాల వల్ల ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా ఉండేలా కొబ్బరి నూనె బిడ్డకు రక్షణ కల్పిస్తుంది.

డాక్టర్‌ జుష్యా భాటియా సరీన్‌ డెర్మటాలజిస్ట్‌.

ఇవి కూడా చదవండి..

క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్

నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 03:06 AM