ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Protect Kitchen Supplies: సరుకులు పాడవకుండా ఇలా

ABN, Publish Date - Jul 10 , 2025 | 02:13 AM

మనం సాధారణంగా వంటగదిలో రకరకాల పప్పులు, రవ్వలు, పిండ్లు, మసాలా దినుసులు నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి వీటికి పురుగులు పట్టడం, బూజు పట్టడం...

మనం సాధారణంగా వంటగదిలో రకరకాల పప్పులు, రవ్వలు, పిండ్లు, మసాలా దినుసులు నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి వీటికి పురుగులు పట్టడం, బూజు పట్టడం, గడ్డలుగా మారడం లాంటివి చూస్తూ ఉంటాం. వానాకాలంలో తరచూ ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉండడమే దీనికి కారణం. అలాకాకుండా వానాకాలంలో వంట సరుకులను ఎలా జాగ్రత్త చేసుకోవాలో తెలుసుకుందాం...

  • సరుకులను గాలి జొరబడని డబ్బాల్లో పోసి నిల్వ చేసుకోవాలి. స్టీల్‌, ప్లాస్టిక్‌ డబ్బాలను ఎంచుకోవచ్చు. గాజు సీసాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇవి సరుకులకు తేమ తగలకుండా కాపాడతాయి.

  • సరుకులు నింపే ముందు సీసాలు, డబ్బాల్లో తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. వాటికి మూతలు సరిగా అమరాయో లేదో పరిశీలించాలి. సీసా లేదా డబ్బా మీద చిన్న పేపర్‌ పెట్టి మూత బిగిస్తే సరుకులు తాజాగా ఉంటాయి.

  • వంటగదిలో కిటికీ, సింక్‌, స్టవ్‌ గట్టు దగ్గర తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాలకు సమీపంలో సరుకులను పెట్టకూడదు. పొడిగా ఉండే అరల్లో మాత్రమే సరుకులు నింపిన డబ్బాలు, సీసాలు సర్దుకోవాలి. అరల్లో మందపాటి పేపర్లు వేయాలి. అలాగే అరల మూలల్లో సిలికా జెల్‌ ప్యాకెట్లు ఉంచడం మంచిది. ఇవి తేమను పీల్చుకుని డబ్బాల చుట్టూ పొడిదనం ఉండేలా చేస్తాయి.

  • వారానికి ఒకసారి డబ్బా మూతలు తీసి పిండ్లు, పప్పులను పరిశీలించాలి. ఏవైనా పురుగులు కనిపిస్తే వెంటనే వాటిని శుభ్రం చేసి మరో డబ్బాలోకి మార్చుకోవాలి.

  • ప్రతి డబ్బాలో ప్లాస్టిక్‌ లేదా చెక్క గరిటెలు, చెంచాలు ఉంచాలి. దీనివల్ల సరుకులకు తేమ చేరే అవకాశాలు తగ్గుతాయి. డబ్బాలను తాకేటప్పుడు చేతులకు తడి లేకుండా రుమాలుతో తుడుచుకోవాలి.

ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 02:13 AM