Bottle Cleaning Tips: నీళ్ల బాటిళ్లు ఇలా శుభ్రం
ABN, Publish Date - Jul 28 , 2025 | 03:45 AM
పాఠశాలలకు, ఆఫీసులకు లేదా బయటకు వెళ్లేటప్పుడు వెంట మంచినీళ్ల బాటిల్‌ను తీసుకెళ్తాం. అందులో ఉండేది నీళ్లే కదా అని బాటిళ్లను తరచూ శుభ్రం చేయరు. దాంతో బ్యాక్టీరియా చేరి బాటిళ్లు...
పాఠశాలలకు, ఆఫీసులకు లేదా బయటకు వెళ్లేటప్పుడు వెంట మంచినీళ్ల బాటిల్‌ను తీసుకెళ్తాం. అందులో ఉండేది నీళ్లే కదా అని బాటిళ్లను తరచూ శుభ్రం చేయరు. దాంతో బ్యాక్టీరియా చేరి బాటిళ్లు వాసన వస్తాయి. కాబట్టి నీళ్ల బాటిళ్లను తరచూ సులువుగా ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..
బాటిల్‌లో రెండు టేబుల్ స్పూన్‌ల బేకింగ్ సోడా లేదా ఉప్పు వేసి, కొంచెం నీరు పోసి మూతపెట్టి బాగా కదపాలి. తరువాత బ్రష్‌తో బాటిల్‌ను రుద్ది శుభ్రం చేయాలి.
కొంచెం నిమ్మరసాన్ని బాటిల్‌లో పోసి మూతపెట్టి బాగా కదిపి మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే దుర్వాసన దూరం అవుతుంది.
ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, కొంచెం నీరు పోసి పదిహేను నిమిషాల తరువాత బాటిల్‌ను బాగా కదిపి నీటితో శుభ్రం చేయాలి.
ఒక టీ బ్యాగ్‌ను బాటిల్‌లో వేసి గోరువెచ్చని నీరు పోసి రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే బ్రష్‌తో రుద్ది కడగాలి.
అలాగే బాటిల్ మూతను శుభ్రం చేసే విషయంలోనూ శ్రద్ధ వహించాలి. మూతను సబ్బు నీటిలో బాగా కడగాలి.
కొన్ని బాటిళ్లకు పాస్లిక్ సీల్ ఉంటాయి. ఆ సీల్‌ను తొలగించి శుభ్రం చేస్తే మంచి ఫలితముంటుంది.
బాటిల్‌ను శుభ్రం చేసి తడి పూర్తిగా ఆరే వరకు మూత పెట్టకూడదు. అలాగే ఇంటికి వచ్చాక బాటిల్‌లో మిగిలిన నీటిని పారబోసి నీటితో శుభ్రం చేసి పూర్తిగా ఆరాకే మూత పెట్టాలి.
ఇవి కూడా చదవండి
మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..
ఈ ఒక్క జ్యూస్‌తో గుండె జబ్బులన్నీ మాయం..
Updated Date - Jul 28 , 2025 | 03:45 AM