Curtain Cleaning: కర్టెన్లను అలాగే వదిలేస్తున్నారా
ABN, Publish Date - Aug 03 , 2025 | 05:07 AM
ఇంటి కిటికీలకు, ప్రధాన ద్వారానికి వేసే కర్టెన్ల మీద ఎక్కువగా దుమ్ము చేరుతూ ఉంటుంది. వీటిని తరచూ శుభ్రం చేయాలనీ లేనిచో శ్వాసకోశ సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. కర్టెన్లను ఎలా శుభ్రం చేయాలో...
ఇంటి కిటికీలకు, ప్రధాన ద్వారానికి వేసే కర్టెన్ల మీద ఎక్కువగా దుమ్ము చేరుతూ ఉంటుంది. వీటిని తరచూ శుభ్రం చేయాలనీ లేనిచో శ్వాసకోశ సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. కర్టెన్లను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం...
రోజూ కర్టెన్లను మెత్తని బ్రష్‌తో తుడుస్తూ దులపాలి. వ్యాక్యూమ్ చేస్తున్నట్లయితే క్లీనర్‌కు బ్రష్‌ను జత చేయాలి. నీళ్లలో ముంచి గట్టిగా పిండిన గుడ్డతో కర్టెన్లను తుడిచినా ప్రయోజనం ఉంటుంది.
కర్టెన్లను ఎటువంటి ఫ్యాబ్రిక్‌తో తయారు చేశారో పరిశీలించాలి. ఫ్యాబ్రిక్ తీరును బట్టి వాషింగ్ మెషిన్‌లో వేయాలా? చేత్తో ఉతకాలా? అనేది నిర్ణయించుకోవాలి. వాషింగ్ మెషిన్‌లో వేసేటట్లయితే అందులోనే డ్రైయింగ్ చేయకూడదు. అలాచేస్తే కర్టెన్లు ముడతలు పడతాయి.
వారానికి ఒకసారి కర్టెన్లను మామూలుగా ఉతికితే సరిపోతుంది. సర్ఫ్, షాంపూ, లిక్విడ్ డిటర్జెంట్‌లలో ఒకదాన్ని తీసుకుని తగుమాత్రం బకెట్ నీళ్లలో వేసి బాగా కలపాలి. అందులో కర్టెన్లను గంటసేపు నానబెట్టాలి. మురికి మరీ ఎక్కువగా ఉందనిపిస్తే నీళ్లలో కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ కలపవచ్చు. తరవాత కర్టెన్లను మంచినీళ్లతో ఉతికి గాలి తగిలేలా నీడలో ఆరేయాలి.
కర్టెన్ల మీద ఒక్కోసారి మరకలు ఏర్పడుతూ ఉంటాయి. అర కప్పు వేడినీళ్లలో రెండు చెంచాల వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మరకల మీద వేసి బ్రష్‌తో మెల్లగా రుద్దాలి. తరవాత అనువైన పద్ధతిలో ఉతికేస్తే మరకలు, మురికి వదిలి కర్టెన్లు శుభ్రంగా ఉంటాయి.
కర్టెన్లను ఉతికేటప్పుడు ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్‌ను ఉపయోగిస్తే అవి పెళుసుబారకుండా ఉంటాయి. వాటి మెరుపుదనం పోకుండా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News
Updated Date - Aug 03 , 2025 | 05:07 AM