ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Home Remedies For Cholesterol: అల్లంతో కొలెస్ట్రాల్‌కు చెక్‌

ABN, Publish Date - Apr 21 , 2025 | 03:52 AM

చెడు కొలెస్ట్రాల్‌ వల్ల గుండె బలహీనమవే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలను అల్లం సహాయంతో తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ చేరడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రక్తప్రసరణ వ్యవస్థ మందగిస్తుంది. దీంతో శరీర భాగాలకు రక్తాన్ని పంపడం కోసం గుండె ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. క్రమంగా గుండె బలహీనమవుతుంది. ఇలాంటి పరిస్థితులకు కారణమైన చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడానికి అల్లం ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం...

అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి మెత్తని పేస్టులా చేయాలి. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో ఒక చెంచా అల్లం పేస్టు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని బాగా మరిగించి గ్లాసులో పోసుకుని మెల్లగా తాగాలి. ఇలా వారానికి రెండుసార్లు తాగుతూ ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి అయిదు అల్లం ముక్కలు వేసి బాగా ఉడికించాలి. తరవాత ఈ నీళ్లను గ్లాసులోకి వడబోసి అందులో మూడు చెంచాల నిమ్మరసం కలుపుకొని తాగాలి. వారానికి ఒకసారి ఇలా తాగితే గుండె సిరల్లో పేరుకున్న కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది.


ఒక అంగుళం పొడవున్న అల్లం ముక్కను సన్నగా తురమాలి. ఈ అల్లం తురుములో ఒక చెంచా బెల్లం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే శరీర భాగాల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ తొలగిపోతుంది. బెల్లానికి బదులు తేనె కూడా కలుపుకోవచ్చు.

అల్లాన్ని చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా ఆరబెట్టాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో రెండు అల్లం ముక్కలను నోట్లో వేసుకుని నములుతూ రసాన్ని మెల్లగా మింగాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకోదు. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.

ఉదయాన్నే టీ పెట్టుకునేటప్పుడు అందులో చిన్న అల్లం ముక్కను కచ్చాపచ్చాగా దంచి వేయాలి. ఈ అల్లం టీ తాగడం వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ఏర్పడదు. ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా అల్లం తురుము కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 03:52 AM