ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మది దోచే మండల

ABN, Publish Date - Mar 19 , 2025 | 04:55 AM

సంస్కృత భాషలో ‘మండల’ అంటే వృత్తం అని అర్థం. విశ్వం లేదా వివిధ లోకాల్లోని దేవతలను సూచించే రేఖాగణిత నమూనాలు లేదా ఆకృతులను మండల అని సంబోధిస్తారు. అయితే కంటికి ఇంపుగా కనిపించడం, వైవిధ్యంగా...

ఫ్యాషన్‌

వైవిధ్యంగా కనిపించాలనుకునే ఫ్యాషన్‌ ప్రియుల కోసం కొత్త కొత్త ధోరణులు పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటిలో తాజాగా ఆదరణ పొందుతున్న ఫ్యాషన్‌ స్టైల్‌... ‘మండల’. దీని గురించి తెలుసుకుందామా?

సంస్కృత భాషలో ‘మండల’ అంటే వృత్తం అని అర్థం. విశ్వం లేదా వివిధ లోకాల్లోని దేవతలను సూచించే రేఖాగణిత నమూనాలు లేదా ఆకృతులను మండల అని సంబోధిస్తారు. అయితే కంటికి ఇంపుగా కనిపించడం, వైవిధ్యంగా ఉండడం మూలంగా మండల డిజైన్లతో దుస్తుల రూపకల్పన ఊపందుకుంది. నలుపు మీద తెలుపు గీతలతో రూపొందించే మండల డిజైన్లు సర్వత్రా ఆదరణ పొందుతూ ఉంటాయి. ఇవే కాకుండా ఆకట్టుకునే రంగులు, డిజైన్లలో కూడా మండల డిజైన్లు రూపొందుతూ ఉంటాయి.


నప్పే సొబగులతో...

అంగీలు, ఫ్రాక్‌లు, పొడవాటి గౌన్లు, లెహంగాలు.. ఇలా మండల డిజైన్‌తో ఎన్నో రకాల దుస్తులు రూపొందుతున్నాయి. అలాగే కాటన్‌తో పాటు లెనిన్‌, శాటిన్‌ వస్త్రాల మీద ముద్రించిన మండల డిజైన్లకు కూడా ఆదరణ పెరుగుతోంది. సౌకర్యం ప్రధానంగా రూపొందే బీచ్‌ వేర్‌, మండల డిజైన్లలోనే ఎక్కువగా రూపొందుతూ ఉంటాయి.

అయితే ఏ రకం దుస్తులు వేసుకున్నా, వాటికి నప్పే ఆభరణాలూ, ఇతరత్రా యాక్సెసరీ్‌సలను జోడించినప్పుడే మండల డిజైన్లు చూడముచ్చటగా మారతాయి. కాబట్టి టెర్రకోట లేదా ఉడెన్‌ ఆభరణాలు, కొల్హాపురి చెప్పులు లాంటి వాటిని ఈ రకం దుస్తులకు జోడిస్తూ ఉండాలి.

ఇవి కూడా చదవండి:

BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Updated Date - Mar 19 , 2025 | 04:55 AM