Health Benefits of Radish Leaves: కంటికి మేలు చేసే ముల్లంగి ఆకులు
ABN, Publish Date - Aug 23 , 2025 | 04:28 AM
ముల్లంగి దుంపలు ఘాటుగా ఉంటాయి. లేత చేదు కూడా ఉంటుంది. కానీ ముల్లంగి ఆకుల్లో ఈ చేదు ఉండదు. అందుకే ..
ముల్లంగి దుంపలు ఘాటుగా ఉంటాయి. లేత చేదు కూడా ఉంటుంది. కానీ ముల్లంగి ఆకుల్లో ఈ చేదు ఉండదు. అందుకే ఈ ఆకులను ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో అనేక రకాల విటమిన్లతో పాటుగా.. ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఆకుల వల్ల కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం.
ముల్లంగి ఆకులు కంటి చూపును మెరుగుపరుస్తాయి. వీటిలో కాల్షియం, మెగ్నిషియం, ఫాస్పరస్ వంటివి ఎక్కువగా ఉంటాయి.
ముల్లంగి ఆకులకు వేడి చేసే స్వభావం ఉంది. అంతే కాకుండా పచ్చి ఆకులు కఫాన్ని పెంచుతాయి. అందువల్ల పచ్చి ఆకులను తినకూడదు.
ఈ ఆకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
వీటిని క్రమం తప్పకుండా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కీళ్లవాతాన్ని హరిస్తాయి. వాపులను తగ్గిస్తాయి.
ముల్లంగి ఆకులను ఎండబెట్టి .. వాటితో టీ కాచుకొని తాగితే కళ్ల మంటలు, దురదలు.. నీరు కారటం వంటివి తగ్గుతాయి.
మధుమేహ వ్యాధి గ్రస్తులకు వచ్చే అరికాళ్ల మంటలు ఈ ఆకుల వల్ల తగ్గుతాయి.
-గంగరాజు అరుణాదేవి
Updated Date - Aug 23 , 2025 | 04:28 AM