చెర్రీ టమాటాలతో ప్రయోజనాలెన్నో
ABN, Publish Date - Jun 05 , 2025 | 06:03 AM
చెర్రీ టమాటాలు గుండ్రంగా ఉండి చిన్న సైజు టమాటాల్లాగే కనిపిస్తాయి. మామూలు టమాటాల్లో కంటే వీటిలో విటమిన్లు, ఇతర పోషకాలు రెండు రెట్లు అధికంగా ఉంటాయి. వీటిని..
చెర్రీ టమాటాలు గుండ్రంగా ఉండి చిన్న సైజు టమాటాల్లాగే కనిపిస్తాయి. మామూలు టమాటాల్లో కంటే వీటిలో విటమిన్లు, ఇతర పోషకాలు రెండు రెట్లు అధికంగా ఉంటాయి. వీటిని అలాగే తినవచ్చు. లేదంటే చిన్న ముక్కలుగా కోసి గ్రీన్‌సలాడ్, పాస్తా సలాడ్‌లాంటి వాటిలో కలుపుకోవచ్చు. పలుచని చక్రాల్లా కోసి బర్గర్, శాండ్‌విచ్‌ల మధ్య పెట్టుకుని తినవచ్చు. రకరకాల వంటకాల్లో కూడా వాడుకోవచ్చు. చెర్రీ టమాటాలు అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.....
వీటిలో ఆర్గానిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం, లైకోపీన్, బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. చెర్రీ టమాటాలను తరచూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు రావు. క్యాన్సర్ కారకాల నుంచి రక్షణ లభిస్తుంది. ఎముకలు బలోపేతమవుతాయి.
చెర్రీ టమాటాల్లో ఎ, సి, ఇ, కె విటమిన్లతోపాటు పీచు పదార్థాలు, కెరోటినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంటువ్యాధులను దరిచేరనివ్వవు. కంటి సమస్యలు, దృష్టి దోషాలను నివారిస్తాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణాశయ సమస్యలు, మలబద్దకం రాకుండా కాపాడతాయి. శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయి. శరీరంలో క్రొవ్వు నిల్వలను కరిగించి రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 06:03 AM