బీట్‌రూట్ ప్రయోజనాలెన్నో
ABN, Publish Date - Jun 16 , 2025 | 05:32 AM
విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్ తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ దీనిని రోజూ తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలివి..
విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్ తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ దీనిని రోజూ తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలివి..
బీట్‌రూట్‌లో సహజ నైట్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. అవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఇందులోని విటమిన్ బి, సిలు రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బీట్‌రూట్ శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బీట్‌రూట్‌లో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థను పనితీరును మెరుగుపరుస్తాయి.
బీట్‌రూట్‌తో ఆరోగ్యమే కాదు అందమూ సొంతమవుతుంది. దీనిలోని విటమిన్లు చర్మాన్ని నిగారింపుకు సహాయపడతాయి. మొటిమలు మచ్చలను యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి తగ్గిస్తాయి.
కాబట్టి అప్పుడప్పుడు బీట్‌రూట్ రసాన్ని ముఖానికి రాసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News
Updated Date - Jun 16 , 2025 | 05:32 AM