వివేకం కోల్పోతే...
ABN, Publish Date - May 02 , 2025 | 03:59 AM
భర్తృహరి ‘నీతి శతకం’లోని ‘శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం...’ అనే అనే శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి తెలుగువారికి పై పద్య రూపంలో అందించారు...
సుభాషితం
ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంభోధి బయోధినుండి పవనాంధోలోకముం జేరె గం
గాకూలంకష పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతముల్
భర్తృహరి ‘నీతి శతకం’లోని ‘శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం...’ అనే అనే శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి తెలుగువారికి పై పద్య రూపంలో అందించారు.
భావం: స్వర్గ లోకంలో ఉండే గంగానది ఆకాశం నుంచి పరమశివుడి శిరస్సుపైకి ఉరికింది. అక్కడి నుంచి హిమాలయాల మీదకు దూకింది. ఆ తరువాత భూమిపైకి చేరింది. సముద్రంలో కలిసింది. చివరకు పాతాళ లోకానికి జారింది. వివేకాన్ని కోల్పోయినవారి తీరు పలు విధాలుగా ఉంటుంది. వారికి ఇటువంటి ఇక్కట్లు తప్పవు. వారు అధఃపాతాళానికి దిగజారిపోతారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 02 , 2025 | 03:59 AM