ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rich Look Interiors: గాజుతో అందంగా

ABN, Publish Date - Jul 23 , 2025 | 02:10 AM

ఇల్లు అందంగా కనిపించాలని గాజుతో తయారుచేసిన రకరకాల అలంకరణ వస్తువులు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఇంటిని అలంకరించడానికి సౌకర్యవంతంగా మార్చడానికి...

ఇల్లు అందంగా కనిపించాలని గాజుతో తయారుచేసిన రకరకాల అలంకరణ వస్తువులు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఇంటిని అలంకరించడానికి సౌకర్యవంతంగా మార్చడానికి కూడా గాజును వినియోగించవచ్చంటున్నారు నిపుణులు.

  • గాజుతో రూపొందించిన టీపాయ్‌, డైనింగ్‌ టేబుల్‌, ల్యాప్‌టాప్‌ టేబుల్‌ లాంటివి ఇంటికి అదనపు అందాన్నిస్తాయి. పారదర్శకంగా ఉండే గాజు కాకుండా రకరకాల రంగుల్లో లభ్యమయ్యే టఫెండ్‌ గ్లాస్‌తో తయారుచేసినవాటిని ఎంపిక చేసుకుంటే ఇంటికి రిచ్‌ లుక్‌ వస్తుంది. పూలు, రకరకాల బొమ్మలు ప్రింట్‌ చేసి ఉన్న గాజు మెటీరియల్స్‌ కూడా లభ్యమవుతున్నాయి. వీటిని తెచ్చి టేబుల్‌ లేదా టీపాయ్‌ ఉపరితలం మీద అమర్చుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

  • ఇంట్లో పెద్దగా ఉన్న హాల్‌ని అందంగా విభజించడం అనేది నేటి ఇంటీరియర్‌ ట్రెండ్‌. చెక్కతో తయారుచేసిన హాల్‌ డివైడర్స్‌ని మనం చూసే ఉంటాం. దీనికి బదులు గాజు పార్టిషన్స్‌ను ఎంపిక చేసుకుంటే ఇల్లు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చుట్టూరా చెక్క ఫ్రేమ్‌ ఉన్నప్పటికీ మధ్యలో గాజు మెటీరియల్‌ను అమర్చుకుంటే ప్రత్యేకంగా ఉంటుంది. ప్రింటెడ్‌, స్టెయిన్డ్‌, ఫ్రోస్టెడ్‌ గాజు రకాలు ఈ తరహా పార్టిషన్స్‌కు బాగుంటాయి.

  • వంటగది, పడక గది, పిల్లలు చదువుకునే గదుల్లో కొన్ని అరలకు గాజు తలుపులు బిగించుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు ఆ అరల్లో అలంకరణ వస్తువులు, బొమ్మలు, ఫొటోలు లాంటివి సర్దుకుంటే అవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. గదులు కూడా విశాలంగా మెరుస్తుంటాయి.

  • కిటికీలకు ఫ్రోస్టెడ్‌ గాజు తలుపులు అమర్చుకోవచ్చు. వీటి మీద రకరకాల డిజైన్లు ప్రింట్‌ చేసి ఉంటాయి. వీటివల్ల ఇంట్లోని వస్తువులు బయటికి కనిపించవు. ఇల్లు కూడా అహ్లాదకరంగా ఉంటుంది.

  • సాధారణంగా మనం ఫాల్స్‌ సీలింగ్‌ కోసం చెక్క, పీఓసీ, జిప్పం లాంటి మెటీరియల్స్‌ వాడుతూ ఉంటాం. వీటికి బదులు గాజు సీలింగ్‌ని వినియోగిస్తే ఇల్లు గ్రాండ్‌గా కనిపిస్తుంది. పూర్తిగా కాకపోయినా ఒక లేయర్‌ను ఇలా ప్రింటెడ్‌ గాజుతో అమరిస్తే బాగుంటుంది. మధ్యమధ్యలో అందమైన లైటింగ్స్‌ పెట్టించుకుంటే ఇంటికి రిచ్‌ లుక్‌ వస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 02:10 AM