ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వంటగది శుభ్రం ఇలా

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:46 AM

అద్దంలా మెరిసే వంటగది అహ్లాదకరంగా ఉంటుంది. వంటగది పరిశుభ్రంగా లేకపోతే క్రిమి కీటకాలు చేరడమే కాకుండా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వంట చేసేటప్పుడు చికాకుగా అనిపిస్తుంటుంది. కాబట్టి ...

అద్దంలా మెరిసే వంటగది అహ్లాదకరంగా ఉంటుంది. వంటగది పరిశుభ్రంగా లేకపోతే క్రిమి కీటకాలు చేరడమే కాకుండా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వంట చేసేటప్పుడు చికాకుగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఇంట్లో దొరికే వస్తువులతో సులువుగా వంటగదిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం....

  • వంట చేసేటప్పుడు వెలువడే పొగ, ఆవిరి వల్ల స్టవ్‌ వెనక గోడపై అమర్చిన టైల్స్‌ మీద జిడ్డు చేరుతూ ఉంటుంది. ఒక్కోసారి పసుపు, కారం, మసాలాల మరకలు కూడా పడుతుంటాయి. అలాంటప్పుడు ఒక గిన్నెలో నాలుగు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల బేకింగ్‌ సోడా వేసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని టైల్స్‌ మీద రాసి రెండు నిమిషాల తరవాత స్క్రబ్బర్‌ లేదా స్పాంజ్‌తో రుద్దాలి. తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే టైల్స్‌ చక్కగా శుభ్రమవుతాయి. వంట పూర్తయిన వెంటనే టిష్యూ పేపర్‌తో టైల్స్‌ని తుడిచేస్తే ఏ సమస్యా ఉండదు.

  • వంట చేస్తున్నప్పుడు స్టవ్‌ కింద, దాని చుట్టూ కూడా ఆహార పదార్థాలు చింది పడుతూ ఉంటాయి. వంట పూర్తయిన తరవాత వీటిని పలుచని గుడ్డతో శుభ్రంగా తుడవాలి. రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా ఉప్పు, రెండు చెంచాల వెనిగర్‌ లేదా లిక్విడ్‌ సోప్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గట్టు మీద చల్లి పది నిమిషాలు ఉంచాలి. తరవాత వేడినీళ్లు పోసి కడిగేస్తే గట్టు పూర్తిగా శుభ్రపడుతుంది. ఇదేవిధంగా స్టవ్‌ని కూడా శుభ్రం చేయవచ్చు.

  • వంటగదిలో ఉండే ట్యూబ్‌లైట్‌, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌, స్విచ్‌ బోర్డులతోపాటు కిటికీ ఊచలు, తలుపులు కూడా జిడ్డు పట్టి దుమ్ము, ధూళితో నిండుతుంటాయి. అలాంటప్పుడు సర్ఫ్‌ లేదా లిక్విడ్‌ సోప్‌ కలిపిన నీళ్లలో ముంచి గట్టిగా పిండిన స్పాంజ్‌తో వీటిని తుడిచేస్తే సరిపోతుంది.

  • అటకమీద, అరల్లో తరచూ బూజు పడుతూ ఉంటుంది. దీన్ని మెత్తని చీపురు లేదా వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. అరల మూలల్లో కర్పూరం బిళ్లలు, లవంగాలు, వేపాకుల్లో ఒకటి ఉంచితే బొద్దింకలు చేరవు.

  • వంటగదిలో నేలను ప్రతిరోజూ ఉప్పునీటితో తుడవాలి. పాత్రలు కడిగే సింక్‌లో కొన్ని వేడినీళ్లు పోసి బ్రష్‌తో రుద్ది శుభ్రం చేయాలి.


Read latest AP News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 05:46 AM